స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటేనే.. భారీతనానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అసలు ‘ఐ’ సినిమా అయితే.. పాటల కోసమే తీసినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. సాంగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోను సాంగ్స్ భారీగా ఉండబోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. గతంలో స్విట్జర్లాండ్‌లో విజువల్ వండర్‌గా ఓ సాంగ్‌ను షూట్ చేశారు. అయితే ఈసారి మాత్రం అంతకుమించి అనేలా సాంగ్ షూట్ చేయబోతున్నారట. నెల రోజుల్లో 12 రోజులు ఇండియన్ 2.. 12 రోజులు ఆర్సీ 15 షూటింగ్ చేస్తున్నాడు శంకర్. రీసెంట్‌గానే ఇండియన్-2 షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తి చేశాడట. ఇక ఇప్పుడు ఆర్సీ 15 టైం అంటున్నారు. అయితే ఈ వీక్‌లోనే సాంగ్ షూట్ చేయాలనుకున్నారట. కానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వాని పెళ్లి ఉండడంతో.. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్లో 500 మంది డ్యాన్సర్లతో ఓ సాంగ్‌ను తెరకెక్కించబోతున్నారట. ఈ లెక్కన శంకర్ నుంచి మరో భారీ సాంగ్ రాబోతోందని చెప్పొచ్చు. ఇప్పటికే తమన్ ట్యూన్ నెక్స్ట్ లెవల్ అంటున్నాడు. శంకర్‌తో కొత్త బ్రెయిన్‌తో పని చేస్తున్నానని.. ఆ పాటలు చూస్తే మీకే అర్థమవుతుందని అంటున్నాడు. కాబట్టి ఆర్సీ 15లో శంకర్ మార్క్ సాంగ్, చరణ్ డ్యాన్స్, తమన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలుస్తుదనడంలో.. ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సినిమాతో శంకర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.