క్రాక్ మూవీ తర్వాత ట్రాక్ తప్పిన రవితేజ.. ధమాకా సక్సెస్ ట్రాక్ ఎక్కడం పక్కా అని.. చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు ఈ వారం ధమాకా మూవీ థియటేర్లోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూసినప్పుడే దర్శకుడు త్రినాథరావు నక్కిన.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారని తెలిసిపోయింది. అందుకు తగ్గేట్టే సినిమా మొత్తం ఫన్ డోస్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో.. మిస్ అయిన లోటుని ధమాకాతో పూడ్చాడని అంటున్నారు. రవితేజ ఫ్యాన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ ధమాకాలో ఉందంటున్నారు. కాకపోతే కథ, కథనంలో కొత్తదనం లేదంటున్నారు.. కానీ ట్రీట్మెంట్ కొత్తగా ఉందంటున్నారు. మొత్తంగా రొటీన్ స్టోరీ అని పెదవి విరుస్తున్నా.. రవితేజ వింటేజ్ లుక్ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ శ్రీలీల గురించి. సగం ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్‌తో మాస్ రాజ్ పెయిర్ ఎలా ఉంటుందోనని అనుకున్నారు అంతా. కానీ రవితేజకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది శ్రీలీల. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందంటున్నారు. మాస్ రాజా ఎనర్జటిక్ పెర్ఫామెన్స్‌కు శ్రీలీల గ్లామర్ మరింత ప్లస్ అయ్యిందని అంటున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో థియేటర్లో విజిల్ వేయిస్తున్నాడు. మొత్తంగా రవితేజ హిట్ కొట్టినట్టేనని చెప్పొచ్చు.