Heroines Favourite Food: సిని రంగంలో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు ఏం చేసినా అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. వారు ఏం వేసుకుంటారు? ఏం తింటారు? లాంటి విషయాలను చాలా మంది ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి మన దగ్గర టాప్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారి ఫేవరెట్ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగువారి గుండెల్లో తనదైన నటనతో ముద్ర వేసుకున్న టాప్ హీరోయిన్(Heroine) సమంత. ఆమెకు టమోటా రైస్ ఫేవరెట్ ఫుడ్ అట. అలాగే మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసిన కీర్తి సురేష్(keerthy suresh)కు నాన్ వెజ్ కంటే వెజ్ ఆహారాలే ఎక్కువ ఇష్టమట. తనకు దోశ, కేరళ రైస్ లాంటివి ఎంతో ఇష్టమని చెబుతుందీమె. ఇంకా టాలీవుడ్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ శ్రీ లీల. ఆమెకు మంగుళూరియన్ రోటీ అంటే ఎంతో ఇష్టమని చెబుతుంది.
వరుస సినిమాలతో మంచి జోరు మీదున్న రష్మికకు తీపి పదార్థాలంటే ఎక్కువ ఇష్టమట. డెజర్ట్స్తో పాటు కొరియన్ ఫ్రైడ్ రైస్, చికెన్ కూడా తన ఫేవరెట్టేనని చెబుతుంది. అలాగే సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవికి వెజ్ ఆహారాలంటేనే ఇష్టం. చాలా సింపుల్గా ఉండే పప్పు, పెరుగన్నం లాంటివి నచ్చుతాయట. హెవీ ఫుడ్స్ అంటే అంత ఇష్టం ఉండదని చెబుతుందీమె. ఇంకా క్యూట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ(anupama parameswaran)కు దాల్ రైస్, చికెన్ లాంటివి అంటే ఎక్కువ ఇష్టం. అమ్మ చేసిన వంటల్ని లొట్టలేసుకుని తింటుందట.