ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు.. ఎప్పుడెప్పుడు పండోర గ్రహంపైకి వెళ్దామా అని ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు డిసెంబర్ 16న అవతార్: ది వే ఆఫ్ వాటర్ థియేటర్లోకి వచ్చేసింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవడంతో.. ఫస్ట్ డే భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఆ తర్వాత మిక్స్డ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. లేదంటే ఈ పాటికి వసూళ్లుసునామి వచ్చే ఉండేది. ఇప్పటివరకు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 సినిమా.. దాదాపు 900 మిలియన్ డాలర్స్.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 7000 కోట్లు రాబట్టింది. దాంతో 350-400 మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి తీసిన సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. కానీ అవతార్ 2 పై ఉన్న అంచనాలకి, ఆ మూవీని తెరకెక్కించడానికి జేమ్స్ కెమరూన్ వెచ్చించిన సమయానికి, పెట్టిన బడ్జెట్‌కి ఈ కలెక్షన్స్ సరిపోవు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఇండియా విషయానికొస్తే.. భారీ వసూళ్లను అందుకుంది అవతార్2. ఓవరాల్‌గా 310 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. 437 కోట్లతో అవెంజర్స్: ఎండ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే యావరేజ్ టాక్‌తోనే అవతార్ 2 వసూళ్లు ఇలా ఉంటే.. అదే ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మోత మోగి ఉండేది. మరి ఈ కలెక్షన్లతో జేమ్స్ కామెరూన్.. అవతార్ సీక్వెల్స్ తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.