Sreeleela : రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు మాస్ మహారాజా రవితేజతోను జోడి కట్టింది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోను ఛాన్స్ అందుకుంది.
రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది. ఇప్పటికే యంగ్ హీరోలతో పాటు మాస్ మహారాజా రవితేజతోను జోడి కట్టింది. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోను ఛాన్స్ అందుకుంది. అలాగే సీనియర్ హీరో బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలోను నటిస్తోంది. ఇవే కాదు ఇంకా చాలా సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ లెక్కన.. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోల చూపంతా శ్రీలీల పైనే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడా లిస్ట్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్లో వస్తున్న ఈ సినిమాలో.. శ్రీలీల హీరోయిన్గా ఫైనల్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. మొత్తంగా శ్రీలీల దూకుడు మామూలుగా లేదు. ఇలాగే కంటిన్యూ అయితే.. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్తోను ఛాన్స్ అందుకోవడం ఖాయం. అదే జరిగితే ఇంకో రెండు, మూడేళ్లు శ్రీలీలనే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరోయిన్లలో రష్మిక, పూజా హెగ్డే లాంటి వారికి సైతం శ్రీలీల చెక్ పెట్టేసినట్టే. ఏదేమైనా.. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోలందరికీ.. ఇప్పుడు శ్రీలీలే కావాలంటున్నారని చెప్పొచ్చు.