BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం సర్వ సౌభాగ్యదాయిని అలంకారంలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి, ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.