»Horoscope Today Todays Horoscope December 8th 2023 Good News Will Be Heard
Horoscope Today : నేటి రాశిఫలాలు(December 8th 2023)..శుభవార్తలు వింటారు
ఈ రోజు(December 8th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈరాశివారికి వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. ఆలయాలను దర్శిస్తారు. బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
వృషభం:
ఈ రాశివారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాలతో సాగుతాయి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అన్నిచోట్లా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల వల్ల అపార్థాలు తలెత్తుతాయి. సతీమణి మాట విని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.
మిథునం:
ఈ రాశివారికి ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో ఆదరణ పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.
కర్కాటకం:
ఈ రాశివారికి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు బావుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఉద్యోగాల్లో మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది.
సింహం:
ఈరాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబెడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బావుంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పర్వాలేదు.
కన్య:
ఈ రాశివారు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలకు ఆర్థిక సాయం చేస్తారు. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం బావుంటుంది.
తుల:
ఈ రాశివారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలను పొందుతారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం:
ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మొండి బాకీలు వసూలు చేస్తారు. శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేస్తారు. అన్ని పనులూ సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు:
ఈ రాశివారికి వృత్తి జీవితం బావుంటుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక బాధలు తీరుతాయి. ప్రయాణాలను వాయిదా వేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం ఇబ్బంది కలిగించవచ్చు.
మకరం:
ఈ రాశివారికి అన్నింట్లోనూ ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు బావుంటాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. చేపట్టిన పనులలో ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు శుభసమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బావుంటుంది.
కుంభం:
ఈ రాశివారికి వ్యాపారాలు బావుంటాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉంటే మంచిది. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం పర్వాలేదు.
మీనం:
అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపార మార్గాలు పెంచుకుంటారు. ఆకస్మిక ధనలాభం వస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.