బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా, శివకాశీ తాలూకా, రెంగపాలయం గ్రామంలో చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రానికి పక్కనే ఉన్న పటాసుల విక్రయ కేంద్రంలో మంళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి హాహాకారాలు వినిపించడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు.
#WATCH | Tamil Nadu: An explosion took place at a firecracker manufacturing factory near Kammapatti village of Virudhunagar district: Fire and Rescue department pic.twitter.com/t4nyL2542w
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అంతలోనే ఫ్యాక్టరీలో మరో పేలుడు చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే గంటకు పైగా పేలుళ్లు సంభవించాయి. ఫైర్ క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకెళ్లడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Tamil Nadu: An explosion took place at a firecracker manufacturing factory near Sivakasi in Virudhunagar district, fire extinguisher reaches the spot: Fire and Rescue department pic.twitter.com/CqE1kCAJ3S
ఈ ప్రమాదంలో 9 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. బాణాసంచా కొన్న కొందరు వ్యక్తులు ఆ షాపు ముందే వాటిని కాల్చారు. దానివల్లే ఈ దారుణం చోటుచేసుకుంది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీపావళి పండగ రానున్న నేపథ్యంలో విక్రయించేందుకు పటాసులు తయారు చేస్తుండగా ఈ దారుణం జరిగింది.