Sivaram Is The Cause Of Pravallika's Suicide: Mother Vijaya
Pravallika: ప్రవళిక (Pravallika) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్-2 వాయిదా వల్ల సూసైడ్ చేసుకుందని విద్యార్థి సంఘాలు రచ్చ చేశాయి. తర్వాత అదేం లేదని ప్రేమ వ్యవహారం కారణం అని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో ప్రవళిక సూసైడ్ విషయం మరుగున పడింది. ప్రవళిక ఆత్మహత్యకు గల కారణాన్ని ఆమె తల్లి విజయ, సోదరుడు ఈ రోజు మీడియాకు వెల్లడించారు. శివరామ్ వేధింపుల వల్లే.. ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.
ప్రేమ పేరుతో శివరామ్ వేధించామని విజయ తెలిపారు. కంటికి రెప్పాలా పెంచుకున్నామని.. తమలా కూలీ, నాలీ చేయొద్దని చదివించామని వివరించారు. శివరామ్ కన్నుపడి.. తమ బిడ్డ కాకుండా పోయిందని చెప్పారు. తమ బిడ్డ తమ నుంచి దూరం అయ్యిందని.. శివరామ్‌కు కూడా ఇదేవిధంగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.
బిడ్డను కోల్పోయి బాధలో ఉన్నామని విజయ పేర్కొన్నారు. దయచేసి మీ రాజకీయాల కోసం తమను వాడుకోవద్దని రాజకీయ పార్టీలను కోరారు. అదీ చెప్పు.. ఇదీ చెప్పు అని తమను ఇబ్బందికి గురిచేయొద్దని సూచించారు. విజయ లాగే ప్రవళిక సోదరుడు కూడా శివరామ్ టార్చర్ పెట్టాడని.. అందుకే తన సిస్టర్ చనిపోయిందని అంటున్నాడు.
అశోక్ నగర్లో ఓ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 కోసం ప్రిపేర్ అవుతుంది ప్రవళిక. గత వారం సూసైడ్ చేసుకుంది. ప్రవళిక సూసైడ్ విషయంలో అధికార పార్టీ గేమ్ ఆడిందని విపక్షాలు అంటున్నాయి. గ్రూప్-2 వాయిదా నేపథ్యంలో సూసైడ్ చేసుకుంటే.. ప్రేమ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారని అంటోంది. ఇన్ని రోజులు ప్రవళిక తల్లి ఎందుకు మౌనంగా ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఆడించినట్టు ఆడుతున్నారని సందేహాం వ్యక్తం చేశారు.