»Honor Killing Scandal Mother And Brother Killed The Girl With A Knife
Andhrapradesh: పరువు హత్య కలకలం.. బాలికను చున్నీతో చంపిన తల్లి, సోదరుడు!
ఆంధ్రప్రదేశ్లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకు 17 ఏళ్ల అమ్మాయిని సొంత తల్లి, సొదరుడే చున్నీతో బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.
నేటి సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినా ఇంకా కొన్నిచోట్ల వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. పరువు హత్యలు ఎక్కడో ఒక చోట కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పరువు హత్య చోటుచేసుకుంది. యువతిని ఆమె తల్లి, సోదరుడు చున్నీ బిగించి మరీ హత్య చేశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. జిల్లాలోని గార్లదిన్నె మండలం, కోటంక గ్రామానికి చెందిన 17 బాలిక కోమల హత్యా ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కోమల తన కుటుంబ సభ్యులకు తన ప్రేమ విషయం తెలిపింది. అయితే తాము చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని వారు పట్టుబట్టడంతో అందుకు ఆమె ఒప్పుకోలేదు. పెళ్లి సంబంధం చూశామని, ఇప్పుడు ఒప్పుకోకుంటే వారికి ఏ సమాధానం చెప్పాలని తల్లీ, సోదరుడు ప్రశ్నించారు. ఆ సమయంలో కోమలకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన తల్లీ, సోదరుడు చున్నీతో కోమలను హత్య చేశారు.
బాలికను హత్య చేసిన తర్వాత తల్లీ, సోదరుడు ఇద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పలువురు పెదవి విరుస్తున్నారు. తల్లే స్వయంగా కూతుర్ని చంపడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.