హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ చిన్న వ్యాన్ వచ్చి వేకంగా ఢీ కొట్టింది. దీంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సేలం ఈరోడ్ హైవేపై తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన సమయానికి ఈంగూర్కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్లో పెరుంతురై వైపు వెళుతున్నారని తెలిసింది. మృతి చెందిన వారిలో సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
VIDEO | Six members of a family killed after a minivan crashed into a truck on Salem-Coimbatore National Highway in Tamil Nadu earlier today. More details awaited. pic.twitter.com/UlbmX3BCNR
వర్షం కారణంగా పెద్ద ఎత్తున వచ్చిన వరదతో ఓ నాలా ఉప్పొంగింది. ఆ క్రమంలో అటుగా వెళ్లిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాచలంలో చోటుచేసుకుంది.