• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో నాలుగు రోజులు మిషన్ భగీరథ వాటర్ బంద్

VKB: మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, ధరూర్‌లో నీటి సరఫరాకు నేటి నుంచి 15వ తేదీ వరకు అంతరాయం కలగనుంది. రాఘవాపూర్ నుంచి పరిగి వరకు ఉన్న ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీలు ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

March 12, 2026 / 06:41 AM IST

58వ డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్‌కు వినతి

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ బొట్ల అనిత మేయర్ మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీ పూడికతీత నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, స్ట్రీట్ లైట్లు, బోర్లు పనిచేయడం లేదని విన్నవించారు. పార్కు నిర్వహణ అధ్వానంగా ఉందన్న ఆమె, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.

March 12, 2026 / 06:40 AM IST

పట్టణంలో గల్లి గల్లీకి ఒక స్మోకింగ్ జోన్

MNCL: జిల్లాలో విచ్చలవిడిగా స్మోకింగ్ జోన్లు సాగుతున్నాయి. ధూమపాన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా సిట్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో గల్లి గల్లీకి ఒక స్మోకింగ్ జోన్ ఉండడం గమనార్హం. కొన్ని చోట్ల స్మోకింగ్ పేరుతో గంజాయి విక్రయాలు కూడా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు స్మోకింగ్ జోన్లపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

March 12, 2026 / 06:36 AM IST

కొమ్మాల జాతర ఆదాయం రూ. 21.22 లక్షలు

WGL: గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మి నరసింహస్వామి జాతరలో మొత్తం ఆదాయం రూ. 21,22,410 వచ్చినట్లు ఆలయ ఈవో ఉగాది ప్రసాద్ తెలిపారు. దేవాదాయశాఖ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయంలోని హుండీల, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనాలు, కేశ ఖండనం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి యమున, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:32 AM IST

డ్రంకన్ డ్రైవ్లో 21 మందికి భారీ జరిమానా

NZB: జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 22 మందిని పోలీసులు పట్టుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్, 21 మందికి మొత్తం రూ.2.10 లక్షలను జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మరొకరికి వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారు చేశారు. అంతకుముందు నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

March 12, 2026 / 06:32 AM IST

‘విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి’

MNCL: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, వార్డెన్ కు సూచించారు. SSC పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.

March 12, 2026 / 06:32 AM IST

‘శాంతిభద్రతల పర్యవేక్షణలో ఏఆర్‌ల పాత్ర కీలకం’

SRCL: శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ (AR) దళాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. సిరిసిల్ల పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన సాయుధ దళాల సమీకరణ కవత్తులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఫైరింగ్, రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

March 12, 2026 / 06:25 AM IST

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

ADB: జైనథ్ మండలం కౌట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు శివ గర్జన అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే పరీక్షలను ప్రతి ఒక్క విద్యార్థి నిర్భయంగా రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:21 AM IST

‘ఇఫ్తార్ వేడుకలు మనుషుల మధ్య సూత్ర భవాని పెంపొందించాలి’

MBNR: ఇఫ్తార్ వేడుకలు మనుషుల మధ్య సూత్ర భావాన్ని పెంపొందించాలని మహబూబ్‌నగర్ టీపీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్లో కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

March 12, 2026 / 06:21 AM IST

స్టడీ సర్కిల్ మెస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

JGL: పట్టణంలో నిర్వహించే ఐదు నెలల ఫౌండేషన్ కోర్సుకు శిక్షణ పొందుతున్న 100 మందికి భోజనాల కోసం మెస్/క్యాటరింగ్ నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 14లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు 9959264770ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

March 12, 2026 / 06:20 AM IST

జిల్లాలో 13 తహసీల్దార్‌ల బదిలీలు

JN: జిల్లాలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు బుధవారం 13 తహసీల్దార్‌లను ఒక్కసారిగా అధికారులు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు విధుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య బదిలీల్లో డి. స్వప్న స్టేషన్ ఘనపూర్‌కు, పి. శ్రీనివాసరెడ్డి జాఫర్గడ్‌కు, ఎం. మహిపాల్ రెడ్డి జనగామకు, ఫణి కుమార్ సూపరిండెంట్ కలెక్టర్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.

March 12, 2026 / 06:19 AM IST

‘టీబీ లేని సమాజం లక్ష్యం’

HNK: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం (మార్చి 24) సందర్బంగా ప్రభుత్వ మర్కాజీ స్కూల్‌లో బుధవారం క్షయ వ్యాధి గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డా.హిమబిందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీబీ లేని సమాజాన్ని తీర్చిదిద్దాలని, ప్రతిఒక్కరు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:18 AM IST

నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇవాళ పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం, కూసుమంచి, ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని తెలిపారు.

March 12, 2026 / 06:16 AM IST

నేడు భద్రాచలం పట్టణంలో విద్యుత్ అంతరాయం

BDK: భద్రాచలం పట్టణంలో ట్రీ కటింగ్ పనుల దృష్ట్యా గురువారం ఉ. 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ముత్యాలమ్మ టెంపుల్, ముదిరాజ్ బజార్, తాత గుడి సెంటర్, రంగనాయకుల గుట్ట, అంబ సత్రం, అహోబిలం మఠం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 12, 2026 / 06:13 AM IST

కారు, బైక్ ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

MBNR: కారు, బైకు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన భూత్పూర్ మండలంలో జాతీయ రహదారి(44)పై అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన పరశురాం, హుస్సేన్ టైల్స్ మేస్త్రీలు పని చేస్తున్నారు. అన్నాసాగర్ గ్రామంలో పని ముగించుకుని జడ్చర్లకు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. బైక్ పైనుంచి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

March 12, 2026 / 06:09 AM IST