HNK: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం (మార్చి 24) సందర్బంగా ప్రభుత్వ మర్కాజీ స్కూల్లో బుధవారం క్షయ వ్యాధి గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డా.హిమబిందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీబీ లేని సమాజాన్ని తీర్చిదిద్దాలని, ప్రతిఒక్కరు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.