• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సర్పంచ్ బాబురావు మృతికి ఎమ్మెల్యే నివాళి

KMM: పాత కమలాపురం గ్రామ సర్పంచ్ తేజవత్ బాబురావు గుండెపోటుతో మరణించడం పట్ల ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని, బాబురావు భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 12, 2026 / 07:30 AM IST

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులు, పెన్నుల పంపిణీ

JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో  టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, ఒక్కొక్కరికి నాలుగు పెన్నులు పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన సామల రాజయ్య-లక్ష్మి దంపతులు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. పరీక్షలు మంచిగా రాసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు విద్యార్థులకు సూచించారు.

March 12, 2026 / 07:21 AM IST

నేడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం కార్యక్రమం

GDWL: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేసినప్పుడే ప్రజాపాలన లక్ష్యం నెరవేరుతుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించే కౌన్సిలర్లు, సర్పంచ్‌ల శిక్షణ ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.

March 12, 2026 / 07:10 AM IST

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 640 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 34 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు.

March 12, 2026 / 07:09 AM IST

బజార్ హత్నూర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా

ADB: బజార్ హత్నూర్ మండల యువత డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ముందుకు రావాలని ఎస్సై సంజయ్ కుమార్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18లోపు పోలీస్ స్టేషన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, టెన్త్ మెమో, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ పత్రాలతో మీ సేవా సెంటర్‌లో స్లాట్ బుక్ చేసి పత్రాలను పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.

March 12, 2026 / 07:08 AM IST

‘పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుంది’

MBNR: పరస్పర ప్రేమాభిమానాలకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన పలు ఇఫ్తార్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

March 12, 2026 / 07:07 AM IST

ఆ పాఠశాల ప్రిన్సిపల్‌కు నోటీసులు

WGL: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. నర్సయ్య నెలరోజులుగా పాఠాలు చెప్పకపోవడంతో డీఈవో బి. రంగయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎం.నర్సయ్యపై నెలరోజులుగా ఏలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మాధవికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

March 12, 2026 / 07:05 AM IST

ఎంజీయూలో బీటెక్ విద్యార్థుల ఆందోళన

న‌ల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధ‌వారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫీజులు అదనంగా రూ.5 వేలు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

March 12, 2026 / 07:05 AM IST

కల్వరాల వాసికి జీవిత ఖైదు

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన వడ్డే కురుమయ్యకు పోక్సో (POCSO) కేసులో జిల్లా జడ్జి సునీత జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు దర్యాప్తు చేపట్టి, నేరం నిరూపితం కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

March 12, 2026 / 07:05 AM IST

సీపీఎం పార్టీ సీనియర్ నేత కొండయ్య మృతి

SRPT: మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు ఉయ్యాల కొండయ్య మంగళవారం రాత్రి కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల మునగాల మండల సీపీఎం పార్టీ నాయకులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

March 12, 2026 / 07:05 AM IST

అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

BHNG: ఆలేరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టి ఐదు ట్రాక్టర్లను పట్టివేశారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ పట్టుబడిన ట్రాక్టర్లపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 12, 2026 / 07:02 AM IST

మైనర్ బాలికకు అబార్షన్? స్కానింగ్ సెంటర్ సీజ్

NGKL: కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రిలో మైనర్ బాలికకు అబార్షన్ చేశారన్న ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, డీఎంహెచ్వో డా.రవి కుమార్ సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

March 12, 2026 / 06:54 AM IST

ధాన్యం దుర్వినియోగం కేసులో రైస్ మిల్ యజమాని అరెస్ట్

ASF: కౌటాల మండలంలో ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని వెంకటేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 1353.7 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇవ్వకుండా దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. రూ. 6.27 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తేలింది.

March 12, 2026 / 06:45 AM IST

వికసిత్ భారత్ జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

GDWL: మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలందర్ బాష, జిల్లా యువజన అధికారి కోట నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజేతలకు అధ్యాపక బృందం బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించింది.

March 12, 2026 / 06:42 AM IST

టెన్త్ పరీక్షలు.. డీఈఓ కీలక సూచనలు

SDPT: ఈనెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు సిద్దిపేట DEO శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల వస్తువుల భద్రత కోసం క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.

March 12, 2026 / 06:42 AM IST