ASF: కౌటాల మండలంలో ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని వెంకటేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 1353.7 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇవ్వకుండా దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. రూ. 6.27 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తేలింది.