• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

BDK: ITDA పీవో బి.రాహుల్ ఆదేశాల మేరకు కిన్నెరసాని (బాలుర) కాంచనపల్లి(బాలికల) క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఈనెల 16,17 తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆళ్లపల్లి HM శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో ఉదయం 8:30 గంటలకు హాజరుకావాలని కోరారు.

March 12, 2026 / 07:35 AM IST

గుడ్ న్యూస్.. 40% సబ్సిడీతో ‘అగ్రి డ్రోన్లు’

VKB: వ్యవసాయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ సబ్సిడీని ప్రకటించింది. రైతులు డ్రోన్లను కొనుగోలు చేసేందుకు 40 శాతం రాయితీ అందించనున్నట్లు పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం తెలిపారు. మండల కేంద్రాల్లోని రైతు వేదికల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు అధిక లాభాలు గడించాలని పవన్ ప్రీతం ఈ సందర్భంగా కోరారు.

March 12, 2026 / 07:34 AM IST

విద్యార్థి జీవితంలో పదవ తరగతి మొదటి మెట్టు

SRCL: విద్యార్థి జీవితంలో పదవ తరగతి మొదటి మెట్టని, సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట ఉన్నత పాఠశాల హెచ్ఎం కైరి పద్మ అన్నారు. సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట ఉన్నత పాఠశాల ఆవరణలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

March 12, 2026 / 07:33 AM IST

మైనర్ల వివాహాలపై ఎస్సై హెచ్చరిక

NGKL: వంగూరు మండల ఎస్సై మహేష్ మైనర్ల వివాహాలపై బుధవారం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలురకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. మైనర్లను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నా, లేదా అందుకు సహకరించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 12, 2026 / 07:32 AM IST

నేడు సర్పంచులకు శిక్షణ తరగతులు

KMR: కళాభారతి ఆడిటోరియంలో సర్పంచులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి (DPO) మురళి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల వినియోగం, సర్పంచుల విధులు, బాధ్యతలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

March 12, 2026 / 07:30 AM IST

చైర్మన్ ను సన్మానించిన మహిళా మండలి సభ్యులు

WGL: మహిళల సాధికారత, సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మి రామానంద్‌ను కస్తూర్బా మహిళా మండలి సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కోసం తాను కృషి చేస్తానని ఛైర్మన్ తెలిపారు. మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.

March 12, 2026 / 07:30 AM IST

సర్పంచ్ బాబురావు మృతికి ఎమ్మెల్యే నివాళి

KMM: పాత కమలాపురం గ్రామ సర్పంచ్ తేజవత్ బాబురావు గుండెపోటుతో మరణించడం పట్ల ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని, బాబురావు భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 12, 2026 / 07:30 AM IST

విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడులు, పెన్నుల పంపిణీ

JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో  టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, ఒక్కొక్కరికి నాలుగు పెన్నులు పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన సామల రాజయ్య-లక్ష్మి దంపతులు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. పరీక్షలు మంచిగా రాసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు విద్యార్థులకు సూచించారు.

March 12, 2026 / 07:21 AM IST

నేడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం కార్యక్రమం

GDWL: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేసినప్పుడే ప్రజాపాలన లక్ష్యం నెరవేరుతుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం బృందావన్ గార్డెన్స్‌లో నిర్వహించే కౌన్సిలర్లు, సర్పంచ్‌ల శిక్షణ ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.

March 12, 2026 / 07:10 AM IST

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 640 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 34 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు.

March 12, 2026 / 07:09 AM IST

బజార్ హత్నూర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా

ADB: బజార్ హత్నూర్ మండల యువత డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ముందుకు రావాలని ఎస్సై సంజయ్ కుమార్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18లోపు పోలీస్ స్టేషన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, టెన్త్ మెమో, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ పత్రాలతో మీ సేవా సెంటర్‌లో స్లాట్ బుక్ చేసి పత్రాలను పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.

March 12, 2026 / 07:08 AM IST

‘పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుంది’

MBNR: పరస్పర ప్రేమాభిమానాలకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన పలు ఇఫ్తార్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

March 12, 2026 / 07:07 AM IST

ఆ పాఠశాల ప్రిన్సిపల్‌కు నోటీసులు

WGL: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. నర్సయ్య నెలరోజులుగా పాఠాలు చెప్పకపోవడంతో డీఈవో బి. రంగయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎం.నర్సయ్యపై నెలరోజులుగా ఏలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మాధవికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

March 12, 2026 / 07:05 AM IST

ఎంజీయూలో బీటెక్ విద్యార్థుల ఆందోళన

న‌ల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధ‌వారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫీజులు అదనంగా రూ.5 వేలు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

March 12, 2026 / 07:05 AM IST

కల్వరాల వాసికి జీవిత ఖైదు

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన వడ్డే కురుమయ్యకు పోక్సో (POCSO) కేసులో జిల్లా జడ్జి సునీత జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు దర్యాప్తు చేపట్టి, నేరం నిరూపితం కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

March 12, 2026 / 07:05 AM IST