• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: రవికుమార్

WGL: పర్వతగిరి మండలంలో “పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్” మండల స్థాయి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ… రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

March 11, 2026 / 09:34 PM IST

డివైడర్లను ఏర్పాటు చేయాలి: BSP

JN: జనగామ-సిద్దిపేట, జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపై సెంటర్ డివైడర్లను ఏర్పాటు చేయాలని BSP జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… డివైడర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

March 11, 2026 / 09:33 PM IST

‘ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చు’

MLG: సహజ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వెంకటాపురం మండలం మండల వ్యవసాయ అధికారి నవీన్ అన్నారు. బుధవారం మండలంలోని రాచపల్లి వ్యవసాయ క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని వారు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన దిగుబడులు వస్తాయన్నారు. రైతులు మొగ్గు చూపాలన్నారు.

March 11, 2026 / 09:26 PM IST

‘అంగన్వాడీ రిటైర్డ్ టీచర్ల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలి’

BDK: ఏళ్ల తరబడి సేవలు అందించి పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అంగన్వాడీ రిటైర్డ్ టీచర్లు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు.

March 11, 2026 / 09:25 PM IST

ప్రభుత్వ విప్‌ను కలిసిన ఎల్లారెడ్డిపేట నూతన సీఐ

SRCL: ఎల్లారెడ్డిపేట సర్కిల్ నూతన ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఓ. వెంకటేశ్ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి, పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నూతన సీఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.

March 11, 2026 / 09:24 PM IST

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన మంత్రి

MNCL: ఈనెల 14న నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ ఎస్ఆర్ఆర్ గార్డెన్‌లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, పెన్సిల్స్ అందించారు.

March 11, 2026 / 09:17 PM IST

ఉరుగ్వేపై స్కాట్లాండ్ విక్టరీ

HYD: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన FIH హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 పూల్-B మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు ఉరుగ్వేపై 3-1 తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ తరఫున జెన్నిఫర్ ఈడీ (10′) ఒక గోల్ చేయగా, కేథరిన్ హోల్డ్ గేట్ (43′, 58′) రెండు గోల్స్ చేసింది. ఉరుగ్వే తరఫున తెరిసా వియాన (18′) ఒక్క గోల్ నమోదు చేసింది.

March 11, 2026 / 09:06 PM IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SI

KNR: ఇల్లందకుంట మండల ప్రజలు రాత్రిపూట ఇళ్ల తలుపులు, కిటికీలు బాగా లాక్ చేసుకోవాలని ఇల్లందకుంట SI క్రాంతి కుమార్ సూచించారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో అంతరాష్ట్ర దొంగలు ఒకే రోజు 9 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

March 11, 2026 / 09:04 PM IST

489 పాఠశాలలు.. 19,835 మంది విద్యార్థులు

NLG: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఈవో బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,147(బాలురు), 9,551(బాలికలు), 137(ప్రైవేటు) ఉన్నట్లు వివరించారు.

March 11, 2026 / 09:00 PM IST

జనగామలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం

JN: జనగామ పట్టణ కేంద్రంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” (Ek Ped Maa Ke Naam) కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. యువ భారత్ వరంగల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. గ్రామ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 11, 2026 / 08:57 PM IST

ధూమపానం ప్రాణాంతకం.. ‘నో స్మోకింగ్ డే’

NGKL: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘నో స్మోకింగ్ డే’ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మదన్ మోహన్ మాట్లాడుతూ.. ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, యువత వీటికి దూరంగా ఉండాలన్నారు.

March 11, 2026 / 08:57 PM IST

స్మశాన వాటిక స్థలాన్ని మార్చాలని ఎమ్మార్వోకు వినతి

WGL: ఖానాపురం మండలంలోని పెద్ధమ్మగడ్డ స్మశానవాటిక రోడ్డు ప్రక్కనే ఉండడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని మనుబోతులగడ్డ గ్రామస్థులు తహాసీల్థార్ రమేష్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన స్మశాన వాటిక ఉండడం వల్ల నిత్యం రాత్రి పగలనక వెళ్ళే మనుబోతులగడ్డ, బండమీదిమామిడి తండా, ఆయకట్టు రైతులకు భయానక వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

March 11, 2026 / 08:54 PM IST

నీరా కేఫ్ లీజ్‌కు టెండర్లు ఆహ్వానం

KMM: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాలు, ఎక్సైజ్ శాఖలో నమోదై, నీరా సేకరణ, విక్రయ అనుమతి కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

March 11, 2026 / 08:52 PM IST

మేయర్ దంపతులకు రాజ్యాధికార సమితి సత్కారం

NZB: బీసీ రాజ్యాధికార సమితి సమావేశం బుధవారం నిజామాబాదు నగరంలో జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ దంపతులను సమితి ప్రతినిధులు సన్మానించారు. బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలని మేయర్ ఉమారాణి సూచించారు. సమితి ప్రతినిధులు బాస రాజేశ్వర్, జీ.రాజేశ్వరి, డాక్టర్ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 08:47 PM IST

జిల్లా ఎస్పీని సన్మానించిన మున్సిపల్ కౌన్సిలర్లు

MLG: ములుగుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మాస్టర్ ప్లాన్ తో పనుల అమలు, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా విజయవంతం చేసినందుకు గాను వారిని సన్మానించారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

March 11, 2026 / 08:47 PM IST