• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో 13 తహసీల్దార్‌ల బదిలీలు

JN: జిల్లాలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు బుధవారం 13 తహసీల్దార్‌లను ఒక్కసారిగా అధికారులు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు విధుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య బదిలీల్లో డి. స్వప్న స్టేషన్ ఘనపూర్‌కు, పి. శ్రీనివాసరెడ్డి జాఫర్గడ్‌కు, ఎం. మహిపాల్ రెడ్డి జనగామకు, ఫణి కుమార్ సూపరిండెంట్ కలెక్టర్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.

March 12, 2026 / 06:19 AM IST

‘టీబీ లేని సమాజం లక్ష్యం’

HNK: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం (మార్చి 24) సందర్బంగా ప్రభుత్వ మర్కాజీ స్కూల్‌లో బుధవారం క్షయ వ్యాధి గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డా.హిమబిందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీబీ లేని సమాజాన్ని తీర్చిదిద్దాలని, ప్రతిఒక్కరు క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:18 AM IST

నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇవాళ పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం, కూసుమంచి, ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని తెలిపారు.

March 12, 2026 / 06:16 AM IST

నేడు భద్రాచలం పట్టణంలో విద్యుత్ అంతరాయం

BDK: భద్రాచలం పట్టణంలో ట్రీ కటింగ్ పనుల దృష్ట్యా గురువారం ఉ. 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ముత్యాలమ్మ టెంపుల్, ముదిరాజ్ బజార్, తాత గుడి సెంటర్, రంగనాయకుల గుట్ట, అంబ సత్రం, అహోబిలం మఠం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ పనులకు వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 12, 2026 / 06:13 AM IST

కారు, బైక్ ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

MBNR: కారు, బైకు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన భూత్పూర్ మండలంలో జాతీయ రహదారి(44)పై అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన పరశురాం, హుస్సేన్ టైల్స్ మేస్త్రీలు పని చేస్తున్నారు. అన్నాసాగర్ గ్రామంలో పని ముగించుకుని జడ్చర్లకు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. బైక్ పైనుంచి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

March 12, 2026 / 06:09 AM IST

విద్యార్థులకు జయి భవ.. విజయీభవ పత్రాలు అందజేత

JGL: రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ‘జయీభవ-విజయీభవ 2.0’ కరపత్రాలు అందజేశారు. విద్యార్థులకు కలెక్టర్ ఆశీస్సులతో కూడిన పంచ సోపానాల కరపత్రాలు అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. హెచ్ఎం సదాశివ్, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, లావణ్య, సాయి రెడ్డి, వేణు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:08 AM IST

‘ఆస్పత్రి కార్మికుల కనీస వేతనం రూ.26,000 ప్రకటించాలి’

WNP: ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం రూ. 26,000కు పెంచుతూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి జీజీహెచ్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో పడకలు, పనిభారం పెరుగుతున్నా, 14 ఏళ్ల క్రితం నాటి వేతనాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 12, 2026 / 06:08 AM IST

ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు: మంత్రి రాజనర్సింహ

MDK: మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘వుమెన్ వెల్నెస్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మహిళలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్షణ కల్పిస్తామన్నరు.

March 12, 2026 / 06:06 AM IST

జిల్లాకు శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ జ‌లాలు విడుద‌ల

SRPT: ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ రోజుల గడువు గడిచినప్పటికీ కూడా శ్రీరాంరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాం సాగర్ రెండవ దశ నీళ్లు ఎప్పుడొస్తాయో..?అంటూ ఎదురుచూస్తున్న జిల్లా రైతాంగానికి నీటిపారుదల శాఖ బుధవారం సాయంత్రం చల్లని కబురు అందించారు. ఈ మేరకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేశారు.

March 12, 2026 / 06:05 AM IST

నేడు ముంబాజీపేటలో రైతులకు అవగాహన సదస్సు

KMR: లింగంపేటలోని మంబోజీపేట్ రైతు వేదిక వద్ద గురువారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సదస్సులో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నానో యూరియా వినియోగం ద్వారా పంటల దిగుబడి పెంపు, ఖర్చులు తగ్గించే విధానాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను తెలుసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు

March 12, 2026 / 06:05 AM IST

నేడు పోచమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు

SRD: పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయం బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. 12న గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, 13న శుక్రవారం నల్ల పోచమ్మ–రేణుక ఎల్లమ్మ కళ్యణోత్సవం, అగ్నిగుండాలు, సాయంత్రం బోనాల ఊరేగింపు జరుగుతాయి. 14న శనివారం ప్రత్యేక పూజలతో పాటు జాతర బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు.

March 12, 2026 / 06:04 AM IST

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: బిజనపల్లి మండలం మాన్య నాయక్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ఇళ్లను పరిశీలించిన ఆయన, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:04 AM IST

దావత్-ఏ-ఇఫ్తార్ విందులో అక్బరుద్దీన్ ఒవైసీ

HYD: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ వద్ద AIMIM ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ దావత్ – ఏ-ఇఫ్తార్ విందుకు AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలతో స్థానిక ముస్లింలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత పెద్దలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేసి, అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 12, 2026 / 06:03 AM IST

కేజీబీవీ మెను పై త‌హ‌సీల్దార్ విచారణ

NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మెనూపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా బుధవారం మండల త‌హ‌సీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు MRO కేజీబీవీలో బాలికలతో పాటు ప్రత్యేక అధికారి, సిబ్బందిపై విడివిడిగా విచారణ నిర్వహించారు. అనంతరం వండిన అన్నం, కూరగాయలను పరిశీలించారు.

March 12, 2026 / 06:03 AM IST

‘నేత్రదాత కుటుంబానికి అభినందన’

PDPL: రామగుండం సీనియర్ జర్నలిస్ట్ జక్కం మారుతి సతీమణి ప్రేమలత ఇటీవల మరణించగా, ఆమె నేత్రాలను సదాశయా ఫౌండేషన్ ద్వారా కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌టీపీసీ కృష్ణానగర్ మారుతి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ వారు కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు. ఇద్దరికీ చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

March 12, 2026 / 05:44 AM IST