• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించాలి:MPDO

GDWL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలని అయిజ ఎంపీడీవో భాస్కర్ సూచించారు. బుధవారం మండలంలోని ఎక్లాస్పూర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న రాగిజావను తాగి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్ షెడ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వంటకు నాణ్యమైన కూరగాయలు వాడాలని సూచించారు.

March 11, 2026 / 08:02 PM IST

గోటి తలంబ్రాలు అందజేసిన సీఐ

SDPT: భద్రాచలం రాముని గోటి తలంబ్రాలను గజ్వేల్ సీఐ రవికుమార్ బుధవారం రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని రామయ్యకు కళ్యాణ తలంబ్రాలు అందజేయడం అదృష్టంగా ఉందని తెలిపారు. కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమానికి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న రామకోటి రామరాజు భక్తి సేవలు అభినందనీయమని కొనియాడారు.

March 11, 2026 / 08:02 PM IST

డబుల్ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలి: ఎమ్మెల్యే

NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే యూజీడీ నిధుల విడుదల, బోధన్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులు పూర్తి చేసి కేటాయింపులు జరపాలని సూచించారు.

March 11, 2026 / 08:02 PM IST

ఇళ్లు అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలి: ఎమ్మెల్యే

NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే యూజీడీ నిధుల విడుదల, బోధన్ రోడ్డులోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మరమ్మతులు పూర్తి చేసి కేటాయింపులు జరపాలని సూచించారు.

March 11, 2026 / 08:02 PM IST

అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా

SRD : జిన్నారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 181లో అక్రమ నిర్మాణాలను ఇవాళ సంబంధిత అధికారులు కూల్చివేశారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో భవనాలను కూల్చి భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాస్, బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి ఉన్నారు.

March 11, 2026 / 08:01 PM IST

తల్లి, బిడ్డల ఆరోగ్యం ఎంతో ముఖ్యం: ఎమ్మెల్యే

RR: మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం బస్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన మదర్ ఫిడింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లి, బిడ్డల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యం అందించడమే మా ధ్యేయమని పేర్కొన్నారు.

March 11, 2026 / 08:00 PM IST

‘నీటి, రోడ్డు సమస్యలను పరిష్కరించాలి’

ADB: నీటి, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని సుంగాపూర్ సర్పంచ్ పెందోర్ లక్ష్మణ్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి భవనంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామస్థులకు నీటి సమస్య తలెత్తుతుందని, దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలన్నారు.

March 11, 2026 / 08:00 PM IST

రెచ్చగొట్టే పోస్టులు పెడితే మాకు తెలపండి: సీఐ

VKB: మోమిన్‌పేట్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ జీ.వెంకట్ సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లకు కీలక సూచనలు చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్, రూమర్స్, మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. చట్ట విరుద్ధమైన సందేశాలు వస్తే వెంటనే తొలగించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటమని చెప్పారు.

March 11, 2026 / 07:52 PM IST

ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహణ

MNCL: జూనియర్ సివిల్ కోర్టులో ఈనెల 28న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి జడ్జి ముఖేష్ తెలిపారు. బుధవారం బెల్లంపల్లి మేజిస్ట్రేట్ సమక్షంలో లోక్ అదాలత్ కో-ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముఖేష్ మాట్లాడుతూ.. కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సముచితమైన మార్గమన్నారు. కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 11, 2026 / 07:52 PM IST

క్రమశిక్షణ, త్యాగానికీ ప్రతీక రంజాన్: కలెక్టర్

ADB: పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, త్యాగం, సోదరభావానికీ ప్రతీక అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విందును స్వీకరించారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు.

March 11, 2026 / 07:51 PM IST

యాదాద్రి దేవస్థానం ఆదాయం ఎంతంటే..!

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం రూ.12,14,835 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.4,47,640, కార్ పార్కింగ్‌తో రూ.1,95,500, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.81,300, ప్రధాన బుకింగ్‌తో రూ.1,05,700, వ్రతాలతో రూ.71,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.

March 11, 2026 / 07:51 PM IST

కేజీబీవీలో తనిఖీ.. ఇరువురికి నోటీసులు

NZB: నవీపేట్ మండలం మోకన్పల్లిలోని KGBVని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణలో లోపాలు, గదుల అపరిశుభ్రతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంఛార్జి స్పెషల్ ఆఫీసర్ కవిత, ఉపాధ్యాయురాలు రాజశ్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

March 11, 2026 / 07:46 PM IST

నర్సరీని పరిశీలించిన ఎంపీడీవో

NRML: సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీని మండల ఎంపీడీవో లక్ష్మీకాంత్ రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మొక్కలకు క్రమం తప్పకుండా ప్రతిరోజు నీరును అందిస్తూ ఉండాలని తెలిపారు. మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరిపే రవళి విలాస్, సెక్రటరీ నరేష్, ఉప సర్పంచ్ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 07:45 PM IST

166 సీనియర్ సిటిజన్ కేసులు పరిష్కారం: కలెక్టర్

PDPL: జిల్లాలో 166 సీనియర్ సిటిజన్ కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ తెలిపారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 130 కేసులు నమోదు కాగా 121 పరిష్కరించాలని తెలిపారు. మంథని పరిధిలో 28 నమోదు కాగా 26 పరిష్కరించినట్లు వెల్లడించారు. 19 అప్పిలేట్ కేసులు నమోదు కాగా, పూర్తిగా పరిష్కరించామని పేర్కొన్నారు.

March 11, 2026 / 07:44 PM IST

చోరీకు పాల్పడిన దొంగ అరెస్ట్

SRPT: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గోవిందాపురంకు చెందిన శ్రీకాంత్ అనే దొంగను అరెస్ట్ చేసినట్టు SI బండి మోహన్ బాబు తెలిపారు. వెంకట్‌నగర్, గోవిందాపురంలో ఇళ్లలో చోరీ చేసిన వస్తువులతో అనుమానాస్పదంగా ఉండడం చూసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు పుస్తెలతాడు, నాలుగు జతల దిద్దులు, మూడు జతల వెండి పట్టీలు, రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకున్నారు.

March 11, 2026 / 07:44 PM IST