JN: జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అస్థిర రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సోమయ్య సుగుణమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
HNK: హన్మకొండ నగరంలోని బాలసముద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గురువారం ప్రసవం కోసం చేరిన మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమెను మరో ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు హాస్పిటల్‌కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువురిని నచ్చజెప్పి శాంతింపచేశారు.
హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల వద్ద గత రెండు రోజులుగా ఉన్న రద్దీ తగ్గి, క్యూ లైన్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. రాష్ట్రంలో సుమారు 3 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
MHBD: జిల్లా కోర్టు ఆవరణలో గురువారం బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి జనగాం సిద్ధార్థను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి గాదే కమల్ కుమార్, సునీత తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పోరాడుతామని తెలిపారు.
KMM: ముదిగొండ మండలం పమ్మి గ్రామ శివారులో గురువారం పోలీసులు మెరుపు దాడి చేసి పేకాటాడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి రూ.7,350 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సూర్యాపేట పట్టణంలోని కేసారం వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబందిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ ట్రినిటీ హైస్కూల్లో ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు.
KMR: మద్నూర్‌లోని పోస్టాఫీసులో శుక్రవారం ఉదయం నుంచి నెలవారీ పింఛన్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు పంపిణీ సిబ్బంది మెంగావార్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పింఛన్‌లతో పాటు ఇతర అన్ని రకాల సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పంపిణీ ప్రక్రియ వారం రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ MLA మదన్ మోహన్ నేడు గాంధారి మండలంలోని బానాపూర్ మరియు రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా రామలక్ష్మణ్ పల్లి గ్రామంలో మధ్యాహ్నం ఒంటి గంటకు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, మండల కాంగ్రెస్ నాయకులు తరలిరావాలన్నారు.
WGL: అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించిన శ్రీరాముడి కళ్యాణం అందరికీ ఆనందోత్సవమని నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదర్శవంతమైన కుమారుడు, సర్వగుణ సంపన్నుడైన భర్తగా, కుటుంబ విలువలకు మార్గదర్శకుడిగా శ్రీరాముడు యుగయుగాలుగా ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. శ్రీరాముడి రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తూ, TGలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు.
KMM: వైరా మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న 4 కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సభ్యత్వాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు గురువారంతో ముగియగా, ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మున్సిపల్ కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం.. మొత్తం 26 దరఖాస్తులు అందాయి. ఇందులో 10 మంది పురుషులు దరఖాస్తు చేసుకోగా, మహిళల నుంచి 16 అభ్యర్థిత్వాలు వచ్చాయి.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గడ్డం లింగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈదుల ప్రదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బోట్ల లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శిగా ఆకారి రాజేశం, కోశాధికారిగా నూనె సత్యనారాయణ, సాంస్కృతిక కార్యదర్శిగా భీమారపు సంపత్ ఎన్నికయ్యారు.
ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని PDSU జిల్లా సహాయ కార్యదర్శి కనకే దత్తాత్రి కోరారు. గురువారం పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో చదివి విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
MBNR: శ్రీరామనవమిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కళాశాల మైదానంలో “వానర” ఆధ్యాత్మిక సంస్థ వారి ఆధ్వర్యంలో భజన్ మ్యూజిక్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. యువతలో దేశభక్తి, దైవభక్తి, దైవం పై మనసు లగ్నం, చెడు వ్యసనాలను దూరం చేయడం అన్న కాన్సెప్ట్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
MULG: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది బాలుగు చంద్రయ్య గురువారం ఎన్నికయ్యారు. కోశాధికారిగా బానోత్ స్వామిదాసు వరుసగా మూడోసారి విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా రవీందర్, ఉపాధ్యక్షుడిగా భిక్షపతి, జాయింట్ సెక్రటరీలుగా రాజ్ కుమార్, నవత, సభ్యులుగా సూర్యం, మన్సూర్, అరుణ్ ఎన్నికయ్యారు.