JGL: వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల విక్రయం ద్వారా రూ.29,900, హుండీ కానుకల ద్వారా రూ.6,298 కలిపి మొత్తం రూ. 36,198 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఆదాయ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది కల్వకుంట్ల అనిల్ రావు, కూకట్ల రాజేందర్, మ్యాత లక్ష్మి పాల్గొన్నారు.
KMM: ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో భూసర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద 5 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి భూ సర్వే పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను గుర్తించామని అన్నారు.
NRML: విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను మెరుగుపరిచేందుకు వారిని విదేశీ పర్యటనలకు పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 40 మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. మొదటి విడతగా నలుగురు ఉపాధ్యాయులు త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
NZB: రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామంలో శ్రీరామ మందిరంలో బుధవారం రాత్రి 12 గంటలకు రథోత్సవం, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని జన్మోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
NZB: ఎడపల్లి వారాంతపు సంత నిర్వహణ కోసం జీపీ ఆధ్వర్యంలో ఇవాళ 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జీపీ కార్యదర్శి నాగరాజు గౌడ్ తెలిపారు. ఈ వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 20 వేల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, అత్యధిక ధర పలికిన వారికి 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు సంత నిర్వహణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
KMM: వైరాలో 10 సంవత్సరాలుగా గిరిజన భవన్‌కు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని గిరిజన నేతలు డిమాండ్ చేశారు. వైరా రింగ్ రోడ్డు నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పక్కన గిరిజన భవనం వద్ద నిరసన కార్యక్రమం చేయనున్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం పిలుపునిచ్చారు.
SRD: అనుమతి లేకుండా అక్రమంగా ఎర్రరాయిని తవ్వకాలు చేపడుతున్న గనులపై దాడులు చేశామని తహసీల్దార్ దశరథ్ అన్నారు. జహీరాబాద్ మండలంలోని హోతి (కే) గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్న ఎర్రరాయి గనులపై రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చెప్పారు.
MDK: బంజారాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్‌ను తూప్రాన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం హైదరాబాదులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు. జైపాల్ నాయక్‌తో పాటు మరికొందరిని ముందస్తు అరెస్టు చేశారు.
KMM: ముదిగొండ మండలం పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ పాము సెల్వరాజ్ కిడ్నాప్‌కు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున గ్రామ సమీపంలో వాకింగ్ చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి ఆయనను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: TGPSC ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయాలంటే తప్పనిసరిగా OTR అప్‌డేట్ చేయాల్సిందేనని TGPSC పేర్కొంది. ఇందుకు నేడే లాస్ట్ డేట్. OTR అప్‌డేట్ కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత 20 నిమిషాలలో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుందని, ఒక వేళ అంతకుమించి ఆలస్యం జరిగితే ఆటోమేటిక్ సిస్టం లాగౌట్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
MBNR: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో విద్యార్థి ఎండి ఫిరోజ్ 100/100 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించారు. నిఖిల్ ఏడవ ర్యాంకు, అవినాష్ 66వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా వారిని అభినందించారు.
BDK: శ్రీ రామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేయు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలాలు, కళ్యాణమండపం, లడ్డు, తలంబ్రాల కౌంటర్లు సులభంగా కనుగొని అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక క్యూఆర్ కోడ్‌ను https://ramanavami.4sightai.com/ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు.
సూర్యాపేట: మోతే మండల కేంద్రంలో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. లబ్ధిదారులు ఇంకా నిర్మాణాలు చేపట్టని ఖాళీ ప్లాట్లను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
WGL: ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఇవాళ కనులపండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలు, విశేష ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
KMM: కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పౌర హక్కులపై ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పింఛన్లు ఉపాధి, శ్మశాన వాటిక అభివృద్ధి సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.