• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘విధి నిర్వహణతో పాటు కుటుంబానికి సమయం కేటాయించండి’

MBNR: విధి నిర్వహణతో పాటు కుటుంబానికి సమయం కేటాయించాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన హెడ్ క్వార్టర్‌లో నేడు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని వెల్లడించారు. ఆరోగ్యానికి కూడా కాపాడుకోవాలని సూచించారు.

April 4, 2026 / 11:03 AM IST

రేషన్ షాపుల ముందు క్యూలైన్‌లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు నెలల రేషన్ పంపిణీ షురూ అయింది. మూడు నెలల రేషన్ ఈ నెలలోనే ఇస్తుండడంతో బయోమెట్రిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానికితోడు మూడు సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి రేషన్ ఇవ్వడానికి పది నిమిషాలకు పైనే పడుతుంది. దీంతో రేషన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి.

April 4, 2026 / 11:03 AM IST

రేపు ఆర్మూర్‌లో ‘హిందూ సమ్మేళనం’

NZB: ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ ఆధ్వర్యంలో ఆదివారం మున్నూరు కాపు కళ్యాణమండపం బాజన్న గైనిలో సాయంత్రం 5.30 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళనం ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ మహేశ్వర నంద మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

April 4, 2026 / 11:03 AM IST

CSI చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా రన్‌ ఫర్‌ జీసస్‌ ర్యాలీ

MNCL: బెల్లంపల్లి పట్టణంలో శనివారం రన్‌ ఫర్‌ జీసస్‌ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీ CSI చర్చి నుంచి మొదలై బజార్ ఏరియా మీదుగా పలు బస్తీల మీదుగా CSI చర్చి వరకు కొనసాగింది. గుడ్‌ ప్రైడే మరుసటి రోజు క్రీస్తు మళ్లీ జన్మించి తన మహిమను లోకానికి వెల్లడించడానికి దోహదపడిన రోజు కావడంతో రన్‌ఫర్‌ జీసస్‌ పేరిట ర్యాలీ నిర్వహించినట్లు మత పెద్దలు తెలిపారు.

April 4, 2026 / 11:01 AM IST

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా సివిల్ జడ్జి

ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్‌లోని శ్రీ కనకదుర్గ దేవి, మహంకాళి అమ్మవారి దేవస్థానంను జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ శనివారం సందర్శించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దేవాయ వినోద్ జడ్జికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. అమ్మవారి ఆశీర్వదాలు ప్రజలందరిపై ఉండాలని కోరారు.

April 4, 2026 / 11:00 AM IST

చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ పాలకవర్గం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ప్రారంభించారు. వేసవికాలం ఎండల వేడి విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు రంజిత్ పాల్గొన్నారు.

April 4, 2026 / 11:00 AM IST

మిర్యాలగూడ, శెట్టిపాలెం లలో ‘రన్ ఫర్ జీసస్’

NLG: మిర్యాలగూడ పట్టణంలోనూ, వేములపల్లి మండలం శెట్టిపాలెంలల్లో ఇవాళ జరిగిన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం అందరికీ ఆదర్శమన్నారు. ఈ పరుగు ఐక్యతకు నిదర్శనమని, యువత ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలపడాలని ఆకాంక్షించారు.

April 4, 2026 / 11:00 AM IST

సలేశ్వరం జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ

NGKL: నల్లమల్ల అటవీలో కొలువుదీరిన లింగమయ్య స్వామి సలేశ్వరం జాతరకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2024 లో దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. 2025లో లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులు సలేశ్వరం జాతరకు వచ్చారు. ఈ ఏడాది జరిగిన జాతరకు మూడు రోజుల్లో 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.

April 4, 2026 / 10:59 AM IST

గాలికుంటు వ్యాధి టీకాలు

MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేశారు. పశువులకు ముందస్తు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. అంటువ్యాధి లాగా గాలికుంటు వ్యాధి వ్యాపిస్తుందని పేర్కొన్నారు. రైతులు సదా అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు. ఎల్ఎస్ఏ రాజిరెడ్డి, ఓఎస్ చిరంజీవి, గోపాలమిత్ర రామస్వామి పాల్గొన్నారు.

April 4, 2026 / 10:47 AM IST

రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న దేవి ప్రసన్న

BDK: కొత్తగూడెం పట్టణం లక్ష్మీదేవిపల్లి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు సాగుతున్నటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అద్భుతమైనదని పాల్గొనడం సంతోషకరమని దేవి ప్రసన్న తెలిపారు. క్రైస్తవ సోదరుల ఐక్యతకు నిదర్శనం అని అన్నారు.

April 4, 2026 / 10:46 AM IST

ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి : ఎమ్మెల్యే

SRD: ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన ముత్తంగి డివిజన్ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీ, న్యూటౌన్ కాలనీలలో ఎమ్మెల్యే జీఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమైనారు.

April 4, 2026 / 10:45 AM IST

ఈనెల 5న తుడుందెబ్బ ప్రత్యేక సమావేశం

MNCL: మంచిర్యాలలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న తుడుందెబ్బ ప్రత్యేక సమావేశానికి అందరూ హాజరు కావాలని రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర కమిటీలు ఒకే గొడుగు కిందకు వచ్చి పని చేయాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అందులో భాగంగానే భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ఈనెల 5న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

April 4, 2026 / 10:44 AM IST

పీడీఎస్ రేషన్ బియ్యం పట్టివేత

NZB: CP పీ.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. టౌన్- 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని హైమద్‌పూర్ కాలనీలో 10 క్వింటాళ్ల పీడీఎస్-రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.40,000లుగా అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని టౌన్- 2 పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు.

April 4, 2026 / 10:44 AM IST

జిల్లాలో భానుడి భగభగలు.. కానాయపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత

WNP: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కానాయపల్లిలో 41.0°C ఉష్ణోగ్రత నమోదైంది. దగడ(39.9°C), ఆత్మకూర్(39.0°C) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జిల్లాలోని 21 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 37°C దాటడంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

April 4, 2026 / 10:39 AM IST

పీహెచ్సీని తనిఖీ చేసిన DMHO

KMR: మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవీందర్ గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వైద్య శిబిరం తాలూకు రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఎంతమందిని మెరుగైన వైద్యానికి సిఫార్సు చేశారో M.O డా. ఆదర్ను అడిగి ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.

April 4, 2026 / 10:33 AM IST