జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని పశువైద్య సబ్‌సెంటర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. గోడలు, వరండా ధ్వంసం కావడంతో పశువులకు చికిత్స అందించడం కష్టమవుతోందని పాడి రైతులు వాపోతున్నారు. భవనం కూలిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BDK: భద్రాచలం గిరిజన మ్యూజియం ఆధునికీకరణకు రూ.కోటి నిధులు విడుదలయ్యాయని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ గురువారం తెలిపారు. అలాగే ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ‘ఆదివాసీ కోయ ఇలవేల్పుల చరిత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వారు వెల్లడించారు. మరో 2 నెలల్లో మ్యూజియం డిజైనింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు.
JGL: రాయికల్ పట్టణంలోని బస్తీ దవాఖానకు రాష్ట్రంలో ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా డాక్టర్ మొహమ్మద్ షబ్బీర్, నర్సింగ్ ఆఫీసర్ వసంత ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పేద ప్రజలందరూ బస్తీ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షబ్బీర్ కోరారు.
BHNG: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడి సాయి బాబా ఆలయంలో సాయిబాబాను గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బీర్ల ఐలయ్య, అనిత కుమారుడు బీర్ల శివమణి పుట్టిన రోజు సందర్భంగా బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
GDWL: అవినీతికి పాల్పడి ఏసీబీకి పట్టుబడ్డ ఐజ మండలం ఎక్లాస్పూర్ గ్రామ అవుట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్నను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉత్తర్వులు జారి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేస్తూ రంగన్న పట్టుబడిన ఘటనపై విచారణ అనంతరం కేసు రుజువు అయ్యింది.
HNK: నడికూడ MPDO ఆఫీసులో నేడు రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రక్తదాన శిబిరంలో మండలంలోని యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎంపీడీవో రామకృష్ణ కోరారు.
KMM: వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 20.77 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లోటు ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్‌పై నిత్యావసరాల చట్టం కింద 6A కేసు నమోదు చేశారు. మరోవైపు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం ఈ నెల 30 వరకు పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు.
GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా నియమితులైన శంకర్ నిన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతినగర్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.
WNP: వనపర్తిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సౌజన్యంతో అంబలి కేంద్రం, చలివేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు తాగునీరు, అంబలి అందిస్తున్నారు.
BHPL: జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీలను TPCC నియమించింది. వైస్ ప్రెసిడెంట్లుగా రాజయ్య, సమ్మయ్య, రాజిరెడ్డి, భువనసుందర్, జనరల్ సెక్రెటరీలుగా బిక్షపతి, సురేందర్, మధువంశి, కృష్ణారెడ్డి, స్వప్నారెడ్డి, సుధాకర్, పూర్తి కమిటీని నియమించారు. జిల్లాలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని TPCC చీఫ్ సూచించారు
NGKL: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుని, మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB)ను ప్రారంభిస్తారని కలెక్టర్ బధావత్ సంతోష్ తెలిపారు. అంతకుముందు ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి, అనంతరం ఇక్కడి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పని చేసిన సాయన్న CEOగా పదోన్నతి పొంది నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా (DRDA) గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన అభివృద్ధి పనులను పర్యవేక్షించేలా చూస్తానన్నారు.
ADB: హైదరాబాద్‌లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అన్వేష్ రెడ్డిని గురువారం డీసీసీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు రైతు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
KNR: జమ్మికుంట మున్సిపాలిటీలో జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ప్రజల ఉపాధి స్థితిగతులపై వివరాలు సేకరించారు. కుటుంబాల ఎంపిక చేసి మూడు నెలల పాటు వారు చేస్తున్న పనుల వివరాలు, జీవన విధానం గురించి ట్యాబ్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
NRPT: ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం పోలీస్ శాఖ బాధ్యత అని ధన్వాడ ఎస్సై వెంకటేష్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఎంనోన్పల్లి గ్రామానికి చెందిన మహిళ ఫిర్యాదుపై, పోలీసులు ఆమె ఇంటికే వెళ్లి FIR నమోదు చేశారు. భర్త, అత్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై తెలిపారు.