• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శుభ్రతలో భాగంగా రహదారిపై పనులు

NLG: నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డుపై కంకర తేలి తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు శుభ్రపరిచే చర్యలు చేపట్టారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య సిబ్బందితో రోడ్డుపై ఉన్న కంకరను పూర్తిగా తొలగించారు. దీంతో రహదారి సురక్షితంగా మారిందని, ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

April 11, 2026 / 03:43 PM IST

డ్రైవర్ అదృశ్యం.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన

KMR: లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన డ్రైవర్ కొమ్ముల రవి ఆరు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. ఈనెల 6న హైదరాబాద్‌లోని నాగోల్ చేరుకుని కుటుంబంతో మాట్లాడిన తర్వాత నుంచి అతని ఆచూకీ లేదన్నారు. దీంతో కుటుంబ సభ్యులు నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 11, 2026 / 03:42 PM IST

రైతులకు పట్టాలను పంపిణీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

ADB: తలమడుగు మండలంలోని పల్సి-బి తండాకు చెందిన గిరిజన రైతుల 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టాలు అందుకున్న రైతులు శనివారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్, గణేష్ రెడ్డి, అధికారులు, తదితరులున్నారు.

April 11, 2026 / 03:37 PM IST

‘డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి’

SRCL: డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై యువత, విద్యార్థులకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా వైద్య కళాశాలలో డ్రగ్స్ నియంత్రణ, డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

April 11, 2026 / 03:33 PM IST

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన MLA వినోద్

MNCL: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం వేమనపల్లి మండలం సూరారం గ్రామపంచాయతీలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని MLA ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే విధంగా ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

April 11, 2026 / 03:33 PM IST

సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ కన్నుమూత

NZB: సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మృతిచెందారు. అనారోగ్యం కారణంగా, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె ఆశావర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేశారు.

April 11, 2026 / 03:31 PM IST

40 డిగ్రీలు దాటిన ఎండలు.. జాగ్రత్త..!

HYDలో ఎండలు భగభగ మండుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పినట్లే జరుగుతోంది. ఉమ్మడి HYD, RR జిల్లాల్లో రెండు రోజుల్లో 40 డిగ్రీలు దాటుతుందని చెప్పగా.. నేడు శంకర్‌పల్లి పరిధి ప్రొద్దుటూరులో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వెల్లడించింది. మరోవైపు HYD జిల్లా పరిధిలో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

April 11, 2026 / 03:31 PM IST

భారీగా విరాళాలు అందజేత

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు గ్రామస్తులు భారీగా విరాళాలు అందజేశారు. సర్పంచ్ ఎర్రల జానకి, ఉపసర్పంచ్ పద్మలకు విరాళాల చెక్కులు అందజేశారు. శ్రీలత రెడ్డి-మోహన్ రెడ్డి దంపతులు రూ.1 లక్ష, ముదిరాజ్, గౌడ సంఘాలు తలో రూ.50 వేలు, రజక సంఘం రూ.15 వేలు విరాళంగా ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని దాతలను అభినందించారు.

April 11, 2026 / 03:30 PM IST

ఆర్టిజన్ల వివక్షపై సీపీఎం ఆగ్రహం

GDWL: సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, విద్యార్హతలున్నా పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల పట్ల వివక్ష చూపడం దారుణమని సీపీఎం గద్వాల్ జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మండిపడ్డారు. గద్వాల జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా వీరి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.

April 11, 2026 / 03:30 PM IST

‘ఇళ్లను ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలి’

SRD: అమీన్పూర్ డివిజన్ ఐలాపూర్ హైడ్రా అధికారులు 6 అంతస్థుల భవనాన్ని కూల్చివేత ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం తగదని అద్దెదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఇళ్లను ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు.

April 11, 2026 / 03:30 PM IST

నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

SDPT: వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామ సర్పంచ్ నేరెళ్ల వెంకటలక్ష్మి తెలిపారు. గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద శనివారం కొత్త బోరు మోటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

April 11, 2026 / 03:30 PM IST

‘అంధకారంలో కంటాయపాలెం.. పట్టించుకోని అధికారులు’

MHBD: తొర్రూరు (M) కంటాయపాలెంలో కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడుతోంది. అసలే వేసవి కాలం కావడంతో పగలు, రాత్రి వేళలో ఉక్కపోతతో గ్రామ ప్రజలు అంతా నిద్రాహారాలు లేకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

April 11, 2026 / 03:30 PM IST

వైద్య సేవలకు రాష్ట్రస్థాయి అవార్డులు.. కలెక్టర్ ప్రశంస

BDK: జిల్లాలో వైద్య సేవలకు రాష్ట్రస్థాయి అవార్డులు రావడం గర్వకారణమని కలెక్టర్ అంకిత్ తెలిపారు. పాల్వంచలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. గిరిజన ప్రాంతాల్లో సమన్వయంతో నాణ్యమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

April 11, 2026 / 03:30 PM IST

‘మహిళా విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది పూలే’

GDWL: మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ గద్వాల్ ఇంఛార్జ్ సరిత అన్నారు. ఇవాళ పూలే జయంతి సందర్భంగా శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1848లో పుణేలో సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించారని గుర్తుచేశారు. పూలే స్ఫూర్తితో మహిళలు విద్యావంతులై ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

April 11, 2026 / 03:30 PM IST

అక్రమ ఇసుక నిల్వల గుర్తింపు

KNR:మానకొండూరు మండలంలోని వెల్ది గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 ట్రిప్పుల ఇసుకను శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీలత, తహశీల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. గుర్తించిన ఇసుకను పంచనామా చేసి, భద్రత నిమిత్తం జీపీఓ స్వాతికి అప్పగించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

April 11, 2026 / 03:18 PM IST