SRCL: సిరిసిల్ల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం సహా ఆచార్యునిగా పనిచేస్తున్న జగన్నాథం నరసయ్య కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ పి. సమ్ములాల్ పర్యవేక్షణలో “తెలంగాణలో SHG ద్వారా గిరిజన మహిళా సాధికారత” అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.
SRPT: నియోజకవర్గాల పెంపు ఆహ్వానించదగ్గ పరిణామం అని ఎమ్మెల్సీ, విప్ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. ఈ నిర్ణయం ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండకూడదు అని అన్నారు. అన్ని పార్టీలకు ఈ నిర్ణయం కలిసి వచ్చే అవకాశం అని అన్నారు. ప్రజా ప్రాతినిథ్యం పెరగాల్సిన అవసరం ఉంది అని అన్నారు. డీ లిమిటేషన్ ఆక్ట్‌తో పాటు మహిళా బిల్ అమలవుతున్న తరుణంలో పెంపు అనివార్యం అని అన్నారు.
NRML: మామడ మండలం బండల్ ఖానాపూర్‌లో మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు పాల్గొని నీటి పొదుపు,ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించారు. నీటి నిర్వహణలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత ఆలయ నిర్మాణ పనులకు మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి రూ. 25,000 విరాళంగా అందజేశారు. సిరిపురం గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తామని, గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు.
WGL: సేంద్రీయ విధానంలో కూరగాయల సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద రైతులకు సూచించారు. గీసుకొండ మండలంలోని కొనాయిమాకుల రైతువేదికలో 100 శాతం రాయితీపై ఉచితంగా ఐదు రకాల కూరగాయల మినీ కిట్స్‌ను రైతులకు పంపిణీ చేశారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి,సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
GDWL: భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు స్వప్నించిన సమసమాజ స్థాపన కోసం నేటి యువత గంజాయి, మాదకద్రవ్యాల మత్తు వీడి పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలి అని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బీరెల్లి దానయ్య అన్నారు. మంగళవారం గద్వాలలో భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల గోడపత్రికను పలు సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మార్చి 30 వరకు వర్ధంతి సభలు ఉంటాయన్నారు.
MHBD: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీ సమీప మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు కానుందనే చర్చ జోరుగా సాగుతోంది. తొర్రూరు కేంద్రంగా విభజన జరిగితే పాలన మరింత చేరువవడమే కాకుండా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.
JN: ACP కార్యాలయంలో CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 40 మొబైల్ ఫోన్లను వెస్ట్ జోన్ DCP రాజ మహేంద్ర నాయక్ బాధితులకు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ పోయిన వెంటనే ప్రజలు CEIR ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికత సాయంతో పోయిన ఫోన్లను త్వరగా రికవరీ చేయొచ్చని పేర్కొన్నారు.
WGL: చెన్నారావుపేట మండలంలోని ఎల్లయ్యగూడెం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ జినుకల కనకమల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా లీడ్ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నాబార్డ్ రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు ‘పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ పుస్తకాన్ని ఆవిష్కరించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పీవో యువరాజ్ మర్మాట్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్, రవీందర్ ఉన్నారు.
MNCL: తాను సజీవంగా ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం తనను చనిపోయావంటున్నారని వేమనపల్లి మండలం దస్నాపూర్ చెందిన పద్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను చనిపోయినట్లు రికార్డు చేశారని MPDO కుమారస్వామికి మంగళవారం ఫిర్యాదు చేసింది. మృతి చెందిన కొడుకు పేరు మీద పట్టా భూమి ఉండడంతో రైతు బీమా కొరకు దరఖాస్తు చేయగా, కొడుకుకు బదులు తాను చనిపోయిన అని రికార్డ్ చేశారని తెలిపింది.
MBNR: ఇప్ప పువ్వు సారా విధానంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని, రేపు అసెంబ్లీలో దీనిపై వివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తున్న వారు తన ప్రసంగాన్ని వినాలని ఆయన సూచించారు. కాగా, ఇటీవల ఆయన ఇప్ప పువ్వు సారా గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.
SRD: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని MLA మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలతో పాటు.. గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు.
SDPT: పెట్రోల్, డీజిల్ కొరత ఉందని ప్రచారం జరగడంతో మంగళవారం సాయంత్రం చిన్నకోడూరు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ డీజిల్ దొరకదనే ఆందోళనలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకున్నారు. ఎక్కువ మొత్తంలో వాహనాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించుకున్నారు. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది.
WGL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల పార్లమెంట్లో MP కావ్య ప్రశ్నించారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే అమలు చేయాలని,తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు.