• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యుత్ ఫిర్యాదులకు వాట్సాప్ సేవలు ప్రారంభం

BHPL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎన్పీడీసీఎల్ వాట్సాప్ సేవలను ప్రారంభించినట్లు జిల్లా ఎస్ఈ మల్సూర్ నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు సులభంగా ఫిర్యాదు చేయేందుకు 7901628348 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపితే ఫిర్యాదు నమోదు, ఏజెంట్‌తో చాట్ వంటి సేవలను పొందవచ్చని వివరించారు

February 27, 2026 / 08:32 AM IST

ఉట్నూర్‌కి రానున్న ఎస్టీ కమిషన్ సభ్యుడు

ADB: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఇవాళ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన సమస్యలైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

February 27, 2026 / 08:30 AM IST

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సైదాపూర్ వాసి

KNR: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దుస్స కుమార్ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా గురువారం నియామకం అయ్యారు. హైదరాబాద్‌లో సంఘం అధ్యక్షుడు రాములు నాయక్, ఉపాధ్యక్షుడు కార్తీక్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపిన కుమార్.. ఉప సర్పంచుల బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

February 27, 2026 / 08:30 AM IST

అధికారులకు భద్రాద్రి ‘రామయ్య’ పరీక్ష..!

BDK: భద్రాద్రి రామనవమి వేడుకలు ఈసారి జిల్లా ఉన్నతాధికారులకు సవాల్‌గా మారనున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్‌ అంకిత్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌కు ఇదే తొలి కళ్యాణ వేడుక. వీరితో పాటు EO దామోదర్‌రావు తొలిసారిగా ఈ వేడుకలను పర్యవేక్షించనున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్‌ అంకిత్ ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించారు.

February 27, 2026 / 08:28 AM IST

సిద్దిపేట విద్యార్థికి స్టేట్ సెకండ్ ర్యాంక్

SDPT: ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభా పరీక్షలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ విద్యార్థి అశ్విత్ రెడ్డి సత్తా చాటాడు. 33 జిల్లాల నుంచి సుమారు 100 మంది పాల్గొన్న ఈ పోటీలో 9వ తరగతి చదువుతున్న అశ్విత్ 50కి 35 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

February 27, 2026 / 08:22 AM IST

జిల్లాలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం

MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇంటి బయటకు వచ్చిన ఇమ్రాన్ (27) అనే వ్యక్తిపై బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితులు ఇమ్రాన్ కడుపులో కత్తితో పొడవడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సింది.

February 27, 2026 / 08:21 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించండి’

SRD: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

February 27, 2026 / 08:21 AM IST

రేపు మంచిరేవుల పార్క్‌లో ‘రాక్ బే నేచర్ క్యాంప్’

HYD: నగరంలోని మణికొండ సమీపంలో ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(TGFDC)ప్రత్యేక ‘రాక్ బే నేచర్ క్యాంప్’ ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 28 సాయంత్రం నుంచి మార్చి 1 ఉదయం వరకు జరిగే ఈ క్యాంప్‌లో ట్రెకింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్ వంటివి ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు నిపుణులతో కలిసి పక్షుల లోకాన్ని చూడొచ్చు.

February 27, 2026 / 08:20 AM IST

మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు

జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొండాపురం ZPHSలో మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు నిర్వహించారు. దస్తూరి పోటీల్లో అనూష శ్రీ, సంగీత ప్రతిభ కనబరిచారు. పద్య పఠనంలో నందిని, పవిత్ర మెప్పించారు. తెలుగు ప్రతిభా పరీక్షలో రాఘవేంద్ర ప్రథమ స్థానం సాధించారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు.

February 27, 2026 / 08:19 AM IST

బండమీదిపల్లిలో నూతన బోరు ప్రారంభం..!

మహబూబ్‌నగర్ జిల్లాలోని 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లి, వడ్డెర బస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ గిరి గౌడ్, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.

February 27, 2026 / 08:19 AM IST

అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలం నందనం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని అన్నారు.

February 27, 2026 / 08:18 AM IST

బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.5 కోట్లు మంజూరు

VKB: కోట్‌పల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 27.5 కోట్ల నిధులు మంజూరైనట్లు మండల మాజీ వైస్ ఎంపీపీ వర్ధ మల్లికార్జున్ వెల్లడించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ పాత బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ నిధులు మంజూరు చేయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 27, 2026 / 08:12 AM IST

పడిపోతున్న రక్తం నిలువలు

NLG: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రక్తం నిలువలు భారీగా పడిపోతున్నాయి. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్లడ్ బ్యాంక్‌లో ప్రస్తుతం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకరికి రక్తం అందించేందుకు ఇద్దరు దాతల నుంచి రక్తం సేకరిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. రానున్న రోజుల్లో ప్రాణాపాయ స్థితి నెలకొనే పరిస్థితి ఉందని పలువురు వైద్యులు ఆందోళన చెందుతున్నారు.

February 27, 2026 / 08:10 AM IST

వన దుర్గమ్మా.. శరణు.. శరణు!

MDK: ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత ఆలయంలో శుక్రవారం వేకువజామున అమ్మవారికి ఆలయ అర్చకుడు రావికోటి పార్థివ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా జలాలతో పవిత్ర అభిషేకం చేసిన అనంతరం, పట్టువస్త్రాలు, రంగురంగుల పూలతో మాతను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి విశేష క్రతువుల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

February 27, 2026 / 08:10 AM IST

‘రెవెన్యూ పన్ను వసూలు ప్రక్రియ ముమ్మరం చేయాలి’

KMM: రెవెన్యూ పన్ను వసూలు ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. నగరంలో పన్ను వసూళ్లు, ఆసరా పెన్షన్ల పంపిణీపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అధికారులతో గురువారం సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్ దరఖాస్తులన్నింటినీ వారం రోజుల్లోగా పరిష్కరించి, అర్హులకు ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు.

February 27, 2026 / 08:08 AM IST