NLG: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రక్తం నిలువలు భారీగా పడిపోతున్నాయి. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్లడ్ బ్యాంక్లో ప్రస్తుతం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకరికి రక్తం అందించేందుకు ఇద్దరు దాతల నుంచి రక్తం సేకరిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవడం లేదు. రానున్న రోజుల్లో ప్రాణాపాయ స్థితి నెలకొనే పరిస్థితి ఉందని పలువురు వైద్యులు ఆందోళన చెందుతున్నారు.