• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు’

SRPT: మైనర్లు వాహనాలు నడపడం వారి ప్రాణాలకే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా అత్యంత ప్రమాదకరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయవద్దని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఇవాళ సాయంత్రం నిర్వహించిన మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్‌లో ఆయన మాట్లాడారు.

March 2, 2026 / 08:03 PM IST

నాచగిరి ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ఆలయ ఈవో రంగాచారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ శర్మ, కృష్ణమాచార్యులు, సుధాకర్ పాల్గొన్నారు.

March 2, 2026 / 08:02 PM IST

‘1976 ఓటర్ లిస్ట్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి’

ADB: లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5న నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని గంగాధర్ కోరారు. సిరికొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1976 ఓటర్ లిస్టు ప్రకారం లంబాడీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. అలాగే టీటీడీని లంబాడీలకు అప్పగించి బతుకమ్మ చీరల స్థానంలో ఘూగ్రో కచోళి ఇవ్వాలన్నారు.

March 2, 2026 / 08:02 PM IST

రాహుల్ గాంధీని కలిసిన ఎమ్మెల్యే

NGKL: జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై ఏళ్లుగా పని చేస్తూ, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని, పలు అంశాల గురించి వివరించినట్లు తెలిపారు.

March 2, 2026 / 08:00 PM IST

హోలీ వేడుకల్లో శాంతిభద్రతలే లక్ష్యం: SP

GDWL: రంజాన్, హోలీ పండుగలు ఒకే సమయంలో వస్తున్న తరుణంలో ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలి అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కులమత బేధాలు అతీతంగా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై నిఘా ఉంచామని, ప్రజల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు.

March 2, 2026 / 08:00 PM IST

కలెక్టరేట్ ముందు అంధుడి పోరాటం

NRML: సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామానికి చెందిన అంధుడు కాసారం రాజేశ్వర్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాడు. మెరిట్ ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2015 నుంచి హెల్త్ వర్కర్, అటెండర్‌గా పనిచేసినా వయోపరిమితి పేరుతో తొలగించారని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరాడు.

March 2, 2026 / 08:00 PM IST

‘వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలి’

HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు మడికొండ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మడికొండలోని డంపింగ్ యార్డులో నిరంతరం చెత్త కాల్చడంతో వెలువడే దట్టమైన పొగ గ్రామమంతా కలుషితమై గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నట్లు బాధితులు తెలిపారు. యార్డును తక్షణమే తరలించాలని కలెక్టర్‌ను కోరారు.

March 2, 2026 / 07:59 PM IST

దాడిని అడ్డుకున్న కార్యకర్తలను అభినందించిన కేంద్ర మంత్రి

KMR: వారం రోజుల క్రితం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యేపై దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను సోమవారం కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందించారు. తమ నేతలను కాపాడుకోవడమే కాకుండా తమ స్వార్థ జీవితాన్ని వదిలి సమాజహితంలో భాగంగా జైలుకు వెళ్లిరావడం అభినందనీయమేనని కేంద్ర మంత్రి అన్నారు.

March 2, 2026 / 07:56 PM IST

డీసీపీ ఆఫీసును సందర్శించిన సీపీ

RR: ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ ఆఫీస్‌ను సందర్శించారు. డీసీపీ ఆఫీసును సందర్శించిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబును డీసీపీ శిరీష స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:54 PM IST

ఇందూరు సంస్కృతికి ప్రతీక కామ దహనం

NZB: జిల్లా ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహన యజ్ఞం నిర్వహించారు. అధ్యక్షుడు సూర్య ప్రకాశ్ ఆర్య మాట్లాడుతూ.. 1993 నుంచి గాంధీ చౌక్లో యజ్ఞం చేస్తున్నామన్నారు. యజ్ఞంతో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య క్రిమి నివారణ కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 4న రంగోలి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 2, 2026 / 07:52 PM IST

‘ఈనెల 5న శివపార్వతుల కళ్యాణం’

PDPL: ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 5న శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజేష్ యాదవ్ తెలిపారు. ఉదయం 8:30కి గణపతి పూజ పుణ్య వచనం, 11:45కు శివపార్వతుల ఉత్సవ విగ్రహ చర ప్రతిష్ట, సాయంత్రం 5 గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడతాయన్నారు. కావున భక్తులు ఈ పుణ్యకార్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

March 2, 2026 / 07:50 PM IST

కేజీబీవీలో ‘ప్యానల్’ బృందం తనిఖీ

JGL: విద్యార్థుల మేధస్సుకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని తనిఖీ బృందం సభ్యులు సూచించారు. సోమవారం పెగడపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీని ప్యానల్ బృందం సందర్శించింది.తరగతి గదులకు వెళ్లి బోధన తీరును, విద్యార్థుల మార్కుల జాబితాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో హెచ్ఎం, ఎస్ఓ, తనిఖీ బృందం సభ్యులు,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:50 PM IST

కామ దహనంలో ఎమ్మెల్యే ధన్పాల్

NZB: నగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:49 PM IST

‘సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి’

ASF: సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో, ఇతరులకు హాని కలిగించకుండా సూచించారు. ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 2, 2026 / 07:48 PM IST

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. కలెక్టర్

HNK: హన్మకొండ జిల్లాలోని ప్రజలందరికీ సోమవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై ప్రతీకగా హోలీ పండగ జరుపుకుంటారన్నారు. సహజసిద్ధ రంగులనే వినియోగించాలని, రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.

March 2, 2026 / 07:42 PM IST