• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి.. పలువురు నివాళి

WGL: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడలా ప్రభాకర్ తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన పార్ధ్వదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 20, 2026 / 11:25 AM IST

మక్కల కొనుగోలు వెంటనే ప్రారంభించాలి: ఎర్రబెల్లి

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

March 20, 2026 / 11:24 AM IST

రైల్వే స్టేషన్‌లో వేగంగా ప్లాట్‌ఫారమ్ పనులు!

VKB: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం నవాంధీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్లాట్‌ఫారమ్ విస్తరణ, ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కువ కోచ్‌లను ఉన్న రైళ్లు ఆగినప్పుడు ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ప్లాట్‌ఫారమ్ పొడవు పెంచుతున్నారు. ప్లాట్‌ఫారమ్‌పై సిమెంట్స్ పనులతో పాటు షెడ్లు, బెంచీలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

March 20, 2026 / 11:23 AM IST

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కార్పొరేటర్

WGL: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ పరిశీలించారు. డివిజన్ నుఅన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

March 20, 2026 / 11:22 AM IST

‘DCC జనరల్ సెక్రటరీగా తిరుపతి రెడ్డి నియామకం’

PDPL: DCC కార్యవర్గాన్ని TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ కమిటీలో ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డిని జనరల్ సెక్రటరీగా నియమించారు. తిరుపతి రెడ్డి 2024 నుంచి పార్టీ మండల అధ్యక్షుడిగా, విధేయతతో పనిచేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

March 20, 2026 / 11:21 AM IST

6వ రోజుకు చేరిన భీమ్ దీక్ష

VKB: నవాబ్‌పేట్ మండల బస్టాండ్ ప్రాంగణంలో భీమ్ దీక్ష ఈ రోజు 6వ రోజుకు చేరి ఉత్సాహంగా కొనసాగింది. మార్చి 15న మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దివిటి ఆనందం ప్రారంభించిన దీక్ష, అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించబడుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దళితరత్న అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

March 20, 2026 / 11:20 AM IST

పెద్ద ఉమ్మెత్తల్ ఆలయ పీఠాధిపతికి అవార్డు

VKB: పూడూరు మండల పెద్ద ఉమ్మెత్తల్ గ్రామం శ్రీ తిరుమలనాథ ఆలయ పీఠాధిపతి ఆచార్య వెంకటదాస్‌కు ధార్మిక రత్న అవార్డు లభించింది. రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో జీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు అందజేసి సన్మానించారు. అవార్డు అందుకున్న పీఠాధిపతి వెంకటదాస్ హర్షం వ్యక్తం చేశారు.

March 20, 2026 / 11:18 AM IST

జిల్లా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీగా చర్ల శ్రీహరి

వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చర్ల శ్రీహరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్ల తాను చూపిన కృషి, నిబద్ధతను గుర్తించి ఉన్నత నాయకత్వం ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానన్నారు.

March 20, 2026 / 11:15 AM IST

రంజాన్ వేళ ఆధ్యాత్మిక శోభ.. విద్యుత్ దీపాల కాంతుల్లో నగరం!

HYD: రంజాన్ పర్వదినం సమీపిస్తుండడంతో నగరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. హలీం రుచులు, అత్తరు సువాసనల మధ్య మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కమాన్ బజార్, అజీజ్ గల్లి వంటి ప్రాంతాల్లో దుకాణాల వద్ద కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. పేద, ధనిక తేడా లేకుండా ముస్లిం సోదరులు పండుగ సామగ్రిని కొనుగోలు చేస్తూ మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు.

March 20, 2026 / 11:15 AM IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 15 శాతం నీటి ఆవిరి

NLG: రాష్ట్రంలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం గణనీయమైన స్థాయిలో నీటి ఆవిరి నష్టం జరుగుతోంది. నిపుణుల అంచనా ప్రకారం.. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిలో సుమారు 10 శాతం నుంచి 15 శాతం వరకు ఆవిరి అవుతున్నట్లు తెలుస్తోంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు, గణనీయమైన పరిమాణంలో నీరు ఆవిరి అవుతుంది.

March 20, 2026 / 11:12 AM IST

గ్రామాల్లో నీటి కొరత.. ప్రజల ఇబ్బందులు

ADB: జిల్లాలో నీటి సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. వేసవి ప్రారంభంతో గ్రామాల్లో నీటి కొరత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా ఉన్నప్పటికీ కొన్ని రోజులపాటు నీరు రాకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

March 20, 2026 / 11:06 AM IST

మేకల మందపై వీధి కుక్కల దాడి

కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్గల్ మండలం బూరుగుపల్లిలో మేకల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన ఉల్లి రామయ్య మేకల మంద మీద కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి రెండు మేకలకు గాయపరిచాయి. శుక్రవారం ఉదయం గోపాలమిత్ర రవీందర్ గాయపడిన మేకలకు ప్రాథమిక చికిత్స చేశారు. వీధి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 20, 2026 / 11:01 AM IST

నమ్మకమైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే

NLG: వ్యాపారులు కస్టమర్లకు నమ్మకమైన సేవలను అందించి అభిమానాన్ని చురగొనాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలం కొర్లపాహడ్ గ్రామ సమీపంలో ఇవాళ నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె వైభవ్ రెస్టారెంట్‌ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నకిరేకల్, కడపర్తి రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీ శివమణికంఠ పెయింట్స్, హార్డ్ వేర్ షాపును ప్రారంభించారు.

March 20, 2026 / 10:55 AM IST

పారిశుధ్య పనులు పరిశీలించిన మేయర్

MNCL: మంచిర్యాల శుభ్రత- ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతలో భాగంగా శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ డివిజన్‌లో జరుగుతున్న పారిశుధ్య పనులు పరిశీలించారు. స్థానికుల సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

March 20, 2026 / 10:48 AM IST

పట్టణంలో పెరుగుతున్న కుక్కల సమస్య

నారాయణపేట పట్టణంలోని వీధులలో అల్లరి కుక్కల సంఖ్య పెరగడం స్థానికులకు సమస్యగా మారింది. రాత్రి సమయంలో వీధుల్లో తిరిగే కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీధి మలుపులపై దాడులు జరిగే సంఘటనలు కూడా నమోదయ్యాయి. స్థానికులు వీధుల పరిసరాల్లో కుక్కల సమస్యలు తీర్చే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

March 20, 2026 / 10:46 AM IST