• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రామాయంపేటలో PACS మహాజన సభ

MDK: రామాయంపేటలోని PACSఆధ్వర్యంలో గురువారం మహాజన సభను ఘనంగా నిర్వహించారు. సంఘం సెక్రెటరీ నర్సింలు, స్టాఫ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ సాయిలు, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ శ్వేత ముఖ్య అతిథులుగా విచ్చేశారు.  ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో సంఘం చేపట్టిన ఆర్థిక లావాదేవీలు, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

March 26, 2026 / 05:30 PM IST

భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

సూర్యాపేట జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జీవో 76 ప్రకారం కొనుగోలుదారు అఫిడవిట్‌తో అర్హులకు పట్టాలు జారీ చేయాలన్నారు. భూ సమస్యలతో పాటు ఎలక్షన్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

March 26, 2026 / 05:29 PM IST

JNTUHలో ‘సిజిల్స్–2026’ వార్షికోత్సవం

JGL: కొడిమ్యాల మండలం నాచుపల్లి కొండగట్టు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ జగిత్యాలలో సిజిల్స్-26 పేరట వార్షికోత్సవం కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ అతిథులైన జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. కిషెన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

March 26, 2026 / 05:28 PM IST

భద్రాచలం ఉత్సవ కమిటీలో నేలకొండపల్లి వాస్తవ్యులకు చోటు

KMM: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీ నీ ఏర్పాటు చేసింది. నేలకొండపల్లి మండలం నుంచి ఇద్దరు ప్రముఖులకు చోటు లభించింది. ప్రముఖ వ్యాపారవేత్త దోసపాటి శేఖర్, రాజేశ్వరపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు దండా సత్యనారాయణలు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

March 26, 2026 / 05:26 PM IST

ఈనెల 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

KNR: కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ఈనెల 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫోరం కరీంనగర్ జిల్లా ఛైర్మన్ కనకం కుమార్ స్వామి మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

March 26, 2026 / 05:24 PM IST

మార్కెట్‌లో మిర్చి పరిశీలించిన చైనా వ్యాపారులు

MHBD: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను చైనా వ్యాపారులు గురువారం సందర్శించారు. తేజ రకం మిర్చిని పరిశీలించి, నాణ్యతపై మార్కెట్ సిబ్బందితో చర్చించారు. మిర్చి ధరలు, సరఫరా స్థితిగతులు, ఎగుమతి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తేజ మిర్చికి ఉన్న డిమాండ్ దృష్ట్యా, భవిష్యత్తులో కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

March 26, 2026 / 05:20 PM IST

సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ కార్మికుల ధర్నా

WGL: పట్టణంలోని ములుగు రోడ్ జంక్షన్ సమీపంలో గల సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. విద్యుత్ అర్టిసన్, అన్ మ్యాన్డ్, పీస్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా సాగింది. ఆర్టిసన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

March 26, 2026 / 05:15 PM IST

మద్యం సేవించిన 22 మందికి జరిమానా

SRCL: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 22 మందికి సిరిసిల్ల కోర్టు మెజిస్ట్రేట్ జయశ్రీ జరిమానాలు విధిస్తూ తీర్పు వెలువరించాలని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించి పట్టుబడిన వారిని కోటలో ప్రవేశపెట్టగా ముగ్గురికి రూ.1,000 ఇద్దరికీ రూ. 15,00,10 మందికి రూ. 2,000, ఐదుగురికి రూ. 5,000, ఒక్కరికి రూ. 7,000 జరిమానా విధించారన్నారు.

March 26, 2026 / 05:14 PM IST

రేపు నిజాంపల్లిలో ఘనంగా శ్రీరామనవ వేడుకలు

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని రామాలయంలో శుక్రవారం (రేపు) శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ నాండ్రే సునీత – రవీందర్ కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. హనుమాన్ భక్తులు, సాయిరాం భక్తులు, అయ్యప్ప భక్తులు గ్రామస్తులంతా ఈ కార్యక్రమాన్నికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

March 26, 2026 / 05:11 PM IST

అల్వాల్ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన

MDCL: అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి తీసుకెళ్లారు. అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

March 26, 2026 / 05:10 PM IST

ఈనెల 29న ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

BDK: గుండాల మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ నితిన్ సింగ్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

March 26, 2026 / 05:05 PM IST

‘బెల్లంపల్లి అభివృద్ధికి అందరి సహకారం అవసరం’

MNCL: బెల్లంపల్లి అభివృద్ధికి అందరి సహకారం అవసరమని MLA గడ్డం వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ దావ స్వాతి ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి సాధారణ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. పట్టణం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, అవసరమైతే CMతో మాట్లాడి అదనపు నిధులు తీసుకువస్తానన్నారు.

March 26, 2026 / 05:03 PM IST

‘రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యత’

SDPT: రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాద రహిత సిద్దిపేటను సాకారం చేసుకోవచ్చని ట్రాఫిక్ SIలు గోపాల్ రెడ్డి, ఉమేష్ పేర్కొన్నారు. ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట బస్టాండ్ వద్ద వాహనదారులకు, ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదన్నారు.

March 26, 2026 / 05:02 PM IST

‘ప్యాకెజ్ 21 ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి’

NZB: బాల్కొండ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ‌కు సంబంధించి ప్యాకెజ్ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి గురువారం తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించరన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

రేపు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

NGKL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌‌కు రేపు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు. వేరుశనగ, మొక్కజొన్న, కందులు ఇతర ధాన్యాన్ని అమ్మేందుకు తెచ్చే రైతులు గమనించాలని ఆయన కోరారు. తిరిగి వ్యవసాయ మార్కెట్ శనివారం యథావిధిగా మార్కెట్ కొనసాగుతుందని ఆయన అన్నారు. రైతులు సహకరించాలని కోరారు.

March 26, 2026 / 05:01 PM IST