సూర్యాపేట జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జీవో 76 ప్రకారం కొనుగోలుదారు అఫిడవిట్‌తో అర్హులకు పట్టాలు జారీ చేయాలన్నారు. భూ సమస్యలతో పాటు ఎలక్షన్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.