NLG: శాలిగౌరారానికి చెందిన కుంభం సత్యనారాయణ అనారోగ్యం నుంచి కోలుకోగా, 2003 బ్యాచ్ (ZPHS) స్నేహితులు ఆదివారం ఆయనను పరామర్శించారు. చిన్ననాటి మిత్రుని వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 30,000 ఆర్థిక సాయం అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆపదలో అండగా నిలిచిన మిత్రులను స్థానికులు అభినందించారు.
SRD: గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలో నల్ల పోచమ్మ తల్లి బోనాల జాతర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో భారీగా భక్తులు హాజరై బోనాలు సమర్పించారు.
JN: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. లింగాల గణపురంలో మీడియాతో రాజయ్య మాట్లాడుతూ.. బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు మొండి చేయి చూపించారని, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు.
PDPL: ఓదెల గ్రామానికి చెందిన గడిగొప్పుల మొండయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, తాను చనిపోతూ ఇద్దరికి చూపునిచ్చాడు. నరేశ్ నేత్రదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు అతడి నేత్ర దానానికి అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డా. భీష్మాచారి ఆధ్వర్యంలో, LVP టెక్నీషియన్ గాజుల సతీశ్ సహకారంతో కార్నియాలు సేకరించి HYD పంపించారు.
KMM: ఉగాది పండుగ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం మధిరలో ‘ఇందిరా మహిళా డైరీ’ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్య క్షురాలు బి. లలితకుమారి, కార్యదర్శి ఎస్కే చాంద్ బీ పాల్గొన్నారు. డైరెక్టర్లు రేణుక, సీతామహాలక్ష్మి తదితరులు హాజరయ్యారు. మహిళా సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని నాయకులు పేర్కొన్నారు.
ADB: భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకై ఉద్యమించాలని CITU జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని CITU కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతిని పురస్కరించుకుని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.
నిర్మల్ పట్టణ కేంద్రంలోని భాగ్యనగర్, గోదాం, ఎన్టీఆర్ మార్గ్, ఈద్గాం, ప్రాంతాలలో రేపు కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏడీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. నూతన నియంత్రికలు ఏర్పాటు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ నిలిపి వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించగలరని కోరారు.
MNCL: జన్నారం మండలంలోని చింతగూడ పీఏసీఎస్ పరిధిలో ఉన్న రైతులు యూరియా బస్తాల కోసం యూరియా యాప్‌లో బుక్ చేసుకోవాలని పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ పరిధిలోని రైతుల కోసం 266 యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే వాటిని అందజేస్తామన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని ఆయన కోరారు.
WNP: కొత్తకోట మండలంలోని శివం కోచింగ్ సెంటర్లో యాజమాన్యాన్ని బెదిరించి పీడీఎస్యు సంఘం అధ్యక్షుడు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని బెదిరించి 30 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. మిగతా డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేయడంతో కోచింగ్ సెంటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. దీంతో కొత్తకోట ఎస్సై ఆనంద్ కేసు నమోదు చేశామన్నారు.
BDK: కొత్తగూడెం పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆదివారం పద్మశాలి కళ్యాణమండపంలో ఎన్నికల కన్వీనర్ పుట్టా శంకరయ్య ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా ప్రసాద్ ఉపాధ్యక్షుడుగా ఉదయ్ కుమార్ కార్యదర్శిగా శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీగా మాధవ్ రావు ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ నూతన కమిటీతో సంఘం మరింత ముందుకు సాగాలని పెద్దలు కోరారు.
NZB: బాల్కొండ మండలం వన్నెల్ (బీ)లో పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అహింసాహిత మహా కరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహిస్తూ శాకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి జ్ఞానదాతగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతటి ఉత్సాహంతో శాకాహార ర్యాలీలు నిర్వహించారన్నారు.
BHNG: వలిగొండ మండలం నాతాళ్ల గూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు,OU రాజనీతి శాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనకు PHD డాక్టరేట్‌ను ఆదివారం ప్రధానం చేశారు. OU సహ ఆచార్యులు డా.M.రమణ పర్యవేక్షణలో “ఏ రోల్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ గవర్నెన్స్, రూరల్ డెవలప్‌మెంట్: ఏ కేస్ స్టడీ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ” అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది.
SRD: సిర్గాపూర్ మండలం పత్యా నాయక్ తండాలో దొంగతనం జరిగిందని ఎస్సై నారాయణ ఆదివారం సాయంత్రం తెలిపారు. తండాలో నిన్న అర్ధరాత్రి గోవింద్ ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి పెట్టె పగలగొట్టి, అందులోని 1తులం బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు. దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించామని, బాధితుడు గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
RR: తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8.22% నిధులు మాత్రమే కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ద్రోహం చేసిందని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు నామమాత్రపు కేటాయింపులతో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
NGKL: ఎర్రవల్లి ముంపు బాధితులు ఆదివారం హైదరాబాద్‌లో ఎంపీ మల్లు రవిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రిజర్వాయర్ ముంపు నుంచి మినహాయింపు కోరుతూ.. 100 రోజులుగా దీక్ష చేస్తున్నామని, న్యాయం చేయాలని వేడుకున్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.