MNCL: మంచిర్యాల శుభ్రత- ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రతలో భాగంగా శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ డివిజన్లో జరుగుతున్న పారిశుధ్య పనులు పరిశీలించారు. స్థానికుల సమస్యల గురించి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.