• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీరామనవమి వేడుకలకు ఎస్‌వీ మోహన్ రెడ్డికి ఆహ్వానం

KRNL: ఆలూరు మండలం కమ్మరచేడులో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రామస్థులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆయనను కలుసి కార్యక్రమానికి విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 06:28 AM IST

శ్రీరంగాపూర్‌లో హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించి, నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

March 22, 2026 / 06:28 AM IST

‘విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం లైన్ క్లియర్ యాప్’

ASF: విద్యుత్ ప్రమాదాలను నివారణ, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల భద్రత కోసం లైన్ క్లియర్(LC) యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే ప్రకటనలో తెలిపారు. LC యాప్‌తో డిజిటల్ పద్ధతిలో అనుమతులు జారీ అవుతాయని పేర్కొన్నారు. ఫీడర్, పంపిణీ లైన్ వివరాలు స్పష్టంగా ఉంటాయని, తప్పుడు ఫీడర్ ఎంపికకు అవకాశం లేకుండా అప్రమత్తం చేస్తుందన్నారు.

March 22, 2026 / 06:27 AM IST

బ‌డ్జెట్ మొత్తం మోసం: మాజీ ఎమ్మెల్యే

NLG: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బడ్జెట్‌లో మొత్తం మోసం చేశార‌ని బీఆర్ఎస్ పార్టీ నల్ల‌గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బ‌డ్జెట్‌పై ఆయన మాట్లాడారు..

March 22, 2026 / 06:26 AM IST

కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి కలకలం

కేరళంలో మరో ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి కలకలం రేపుతోంది. కోళికోడ్ జిల్లాలో షిగెల్లా వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎరంజికల్ ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితం ఈ వ్యాధి బారిన పడిన నలుగురిలో ఒక చిన్నారి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

March 22, 2026 / 06:26 AM IST

సిద్దిపేటకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు’

SDPT: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేసి, నేడు ఏ మొహం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు నిధులను అర్ధాంతరంగా నిలిపేశారని మండిపడ్డారు.

March 22, 2026 / 06:25 AM IST

హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణ

NZB: ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో ఈ నెల 29న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు గుండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, హిందూ చైతన్యం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ క్షేత్రాల హిందూ యువత పాల్గొన్నారు.

March 22, 2026 / 06:23 AM IST

బిర్యానీ చేస్తుండగా గ్యాస్ లీక్.. క్షణాల్లో చెలరేగిన భారీ మంటలు

SRPT: కోదాడ పట్టణంలో రంజాన్ వేడుకలు ఒక్కసారిగా విషాదంగా మారాయి. మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలో శనివారం ఓ ఇంట్లో పండుగ సందర్భంగా బిర్యానీ చేస్తుండగా గ్యాస్ లీకేజీ జరిగి, ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే అగ్నిజ్వాలలు ఇల్లు మొత్తాన్ని కమ్మేసి, కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశాయి. ఈ ప్రమాదంలో షేక్ నాగుల్ తీవ్రంగా గాయపడ్డారు.

March 22, 2026 / 06:22 AM IST

పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి.. జాగ్రత్త..!

HYD: MNJ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఊపిరితిత్తులు, ఉదరం సంబంధిత క్యాన్సర్ కేసులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2025లో ఊపిరితిత్తుల క్యాన్సర్ 785 మందిలో, ఉదరం సంబంధిత క్యాన్సర్ 445 మందిలో గుర్తించారు. నోటి, గొంతు క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, పొగ త్రాగడం, మద్యం సేవనం వంటి అలవాట్లు ప్రధాన కారణాలు అని వైద్యులు తెలిపారు.

March 22, 2026 / 06:20 AM IST

ఈనెల 26న తై బజార్, పశువుల సంత వేలం

వనపర్తి మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తై బజార్, పశువుల సంత, జంతు వధశాల వేలం ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఛైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవి తెలిపారు. ఆసక్తి గలవారు తై బజార్ కోసం రూ.2 లక్షలు, సంత, వధశాల కోసం చెరో రూ.50 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు.

March 22, 2026 / 06:20 AM IST

‘ఇరుముడి’ కోసం రీమిక్స్‌ పాట?

రవితేజ, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ఐకానిక్ అయ్యప్ప స్వామి పాట ‘ఎక్కినాడు పల్లకి’ని రీమిక్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ స్పందిస్తూ.. అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని, అయితే తుది నిర్ణయం దర్శక-నిర్మాతల చేతుల్లోనే ఉందని తెలిపాడు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన ఈ మూవీ రాబోతుంది.

March 22, 2026 / 06:20 AM IST

బీజేపీ పార్టీలో చేరిన వ్యాపారవేత్త

అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీలో చేరారు. శనివారం విశాఖలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. బీజేపీ ఆశయాలు సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.

March 22, 2026 / 06:19 AM IST

‘ఎల్పీజీని వాణిజ్య అవసరాలకు వాడొద్దు’

ADB: గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీతో ప్రజలకు అందిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్‌లో వినియోగించడం చట్ట విరుద్ధమని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు.

March 22, 2026 / 06:19 AM IST

ఉమామహేశ్వర ఆలయంలో సినీ నటుడు సందడి

NGKL: బల్మూర్ మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుప్రీత్ రెడ్డి (ఛత్రపతి కాట్రాజు) దర్శించుకున్నారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 22, 2026 / 06:18 AM IST

ఘనంగా సీతారామ కళ్యాణ ప్రత్యేక పూజలు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపా నిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. రామాయణ పారాయణం, రామాయణ ప్రవచనం ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

March 22, 2026 / 06:17 AM IST