• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేద ముస్లీం మహిళకు ఇల్లు కట్టిచ్చిన డాక్టర్

BHNG: భువనగిరి మండలం తాజ్ పూర్‌కు చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె పరిస్థితి చూసి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా సామాజికవేత్త డా.ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి చేయూతనిచ్చారు. ఆ ఇంటిని శనివారం రంజాన్ సందర్బంగా గృహప్రవేశం చేయించారు.

March 22, 2026 / 06:50 AM IST

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

ELR: విద్యార్థులందరూ చదువులోనే కాకుండా క్రీడల్లో, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ముందుండాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. శనివారం రాత్రి జంగారెడ్డి గూడెం మండలం వేగవరంలో ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక రంగాలలోనూ ముందుండాలని సూచించారు.

March 22, 2026 / 06:49 AM IST

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 06:49 AM IST

ఆఫ్ఘనిస్తాన్‌లోని భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లోని భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 22, 2026 / 06:49 AM IST

కార్యకర్త ఇంట్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: పట్టణ కేంద్రానికి చెందిన మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ నివాసంలో శనివారం రాత్రి రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రంజాన్ మాసం ముస్లిం ప్రజలకు పవిత్రమైన నెల అని అన్నారు. అల్లా దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. DCC అధ్యక్షుడు అశోక్ తదితరులు ఉన్నారు.

March 22, 2026 / 06:48 AM IST

ఎస్ఎల్బిసి సోరంగం పనులు పునః ప్రారంభం

NGKL: ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పునః ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా టీబీఎం మిషన్లతో కాకుండా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో పనులు ప్రారంభించడం గమనార్హం. ఇప్పటికే గత ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్ లెట్ వైపు సొరంగం పనులు ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి 22న ఇన్ లెట్ పనుల్లో 13.95 కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పుకూలి ప్రమాదం చోటు చేసుకుంది.

March 22, 2026 / 06:48 AM IST

గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా సాగుతుంది: కలెక్టర్

ADB: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా శనివారం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండటంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందన్నారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్‌లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

March 22, 2026 / 06:47 AM IST

మంత్రి వివేక్ నేటి పర్యటన వివరాలివే..

MNCL: చెన్నూర్ నియోజకవర్గంలో మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల సమయంలో క్యాతన పల్లిలోని పలు వార్డ్‌లలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం 10 గంటలకు మందమర్రిలో రూ. 2.31 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

March 22, 2026 / 06:46 AM IST

నేడు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

SDPT: నంగునూరు (M) నర్మెటలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మి పెరుమాళ్ కలిసి హెలిప్యాడ్, సభాప్రాంగణం, 150 స్టాళ్లను పరిశీలించారు.

March 22, 2026 / 06:44 AM IST

ప్రజలకు అవగాహన కల్పించిన కురవి ఎస్సై

MHBD: కురవి మండలం తిర్మలాపురం గ్రామంలో ఎస్ఐ గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వాడకం, గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల నిషేధం, సిసి కెమేరాల ఏర్పాటుపై ఎస్ఐ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ కనకటి అచ్చమ్మవీరన్న, ఉపసర్పంచ్ దేవి శ్రీను, వార్డ్ సభ్యులు అయనను సన్మానించారు.

March 22, 2026 / 06:43 AM IST

భీమవరంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు

W.G: భీమవరంలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్-23 పురుషుల, మహిళల ఓపెన్ బాక్సింగ్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సాగి రామకృష్ణంరాజు ట్రోఫీ-2026’ పేరిట ఈ ఛాంపియన్ షిప్‌ను నిర్వహిస్తున్నారు. యువ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

March 22, 2026 / 06:42 AM IST

‘భూభారతి సమస్యలు వెంటనే పరిష్కరించాలి’

WGL: చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో 1141 మంది రైతులు సాదా బైనామా ద్వారా దరఖాస్తులు చేసుకుని నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు ఆరోపించారు. పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రతిరోజూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి భూభారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

March 22, 2026 / 06:41 AM IST

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరిస్తాం: గోరంట్ల

E.G: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కోలమూరు పంచాయతీ రాయుడుపాకలో ఉపాధి హామీ కూలీల సమస్యలను శనివారం స్వయంగా తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఐరిస్ పడని వారికి బయోమెట్రిక్ సౌకర్యం కల్పించాలని సూచించారు.

March 22, 2026 / 06:40 AM IST

సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన

KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో నూతన 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని శనివారం సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, ఎఫ్ఎవో కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషితో మంజూరైన ఈ ఉపకేంద్రాన్ని ఎకో టూరిజం పార్క్ సమీపంలో నిర్మించేందుకు పంచాయతీ తీర్మానం చేసింది. స్థలానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు తెలిపారు.

March 22, 2026 / 06:38 AM IST

ఈనెల 25 నుంచి బ్రహ్మోత్సవాలు

GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెం శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని ధర్మకర్తలు వాసిరెడ్డి దుర్గాప్రసాద్, పుతుంబాక సత్యసాయికృష్ణ, వాసిరెడ్డి శ్రీకృష్ణ, నాగార్జున తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.

March 22, 2026 / 06:38 AM IST