• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

23వ తేదీన శాయంపేటలో రక్తదాన శిబిరం

HNK: శాయంపేట మండల కేంద్రంలో ఈ నెల 23వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు BRS నేతలు తెలిపారు. 23వ తేదీన ఉదయం 9 గంటలకు SVKK ఫంక్షన్ హాలులో రక్తదాన శిబిరం నిర్వహించబడుతుందని, మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని నేతలు కోరారు.

March 21, 2026 / 06:03 PM IST

రాష్ట్ర బడ్జెట్‌పై మండిపడ్డ బీజేపీ నేతలు

MDK: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు ఆరోపించారు. రామాయంపేట బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యారంగానికి కేవలం ఎనిమిది శాతం నిధులు కేటాయించడంపై మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

March 21, 2026 / 06:03 PM IST

శ్రీకాకుళం నుంచి తిరుపతికి రైలు ప్రతిపాదన

TPT: శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతికి వెళ్లేలా రైలు సర్వీస్ నడిపే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం రైల్వే హాల్ట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ట్రైన్ వస్తే ఇటు శ్రీవారి భక్తులకు, వలస కార్మికులకి చాలా ఉపయోగంగా ఉండనుంది.

March 21, 2026 / 06:02 PM IST

సాగు నీళ్ల కొరతతో ఎండుతున్న పంటలు

WGL: చెన్నారావుపేట (M)లోని పలు గ్రామాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశకు చేరుకునే సమయంలో నీటి కొరత కారణంగా మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు శనివారం తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి SRSP కాలువ నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

March 21, 2026 / 06:02 PM IST

ప్రపంచ శాంతికి రంజాన్ ప్రతిరూపం: ఎమ్మెల్యే

ADB: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం ఉట్నూర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రపంచ శాంతికి ప్రతిరూపమని ఆయన కొనియాడారు. అందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

March 21, 2026 / 06:01 PM IST

‘నల్లాలకు బిరడాలు.. జాగ్రత్తలు పాటించాలి’

PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఇంటి నల్లాలకు బిరడాలు సరిగా పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. నల్లాల సంపులను శుభ్రంగా లేకపోతే నాచు, మట్టి పేరుకుపోయి మురికి నీరు, దుర్వాసన వచ్చే ప్రమాదం ఉందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలన్నారు.

March 21, 2026 / 06:01 PM IST

రూ. 2.5 లక్షల ఎల్‌వోసీ అందజేత

MDK: హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామానికి చెందిన అక్షిత్‌కు వైద్య సహాయం అందింది. నియోజకవర్గ ఇన్‌‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి రూ.2.5 లక్షల ఎల్‌వోసీ అందజేశారు. ప్రస్తుతం అక్షిత్ హైదరాబాద్‌లోని నిమ్స్ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 06:00 PM IST

నవాబ్‌పేటలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

MBNR: అనారోగ్యంతో పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని నవాబ్‌పేట మండలంలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. షాద్‌నగర్‌లో చదువుతున్న ఆమె గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై విక్రం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టుతున్నారు.

March 21, 2026 / 06:00 PM IST

పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం

SDPT: హుస్నాబాద్ యాసంగి సీజన్‌లో సాగు చేసిన పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటల్ కు రూ. 7,721వేలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 06:00 PM IST

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈద్ సంబరాలు

రంజాన్ పండుగను పురస్కరించుకొని గద్వాలలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు సహా పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు కలెక్టర్‌ రుద్రం భాషను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోదరా భావంతో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు.

March 21, 2026 / 06:00 PM IST

‘కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి’

ప్రకాశం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో జరిగిన జిల్లా ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చి నేటికి  2 ఏళ్లు అవుతున్న ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు.

March 21, 2026 / 06:00 PM IST

మండపేటలో మెగా జాబ్ మేళా

కోనసీమ: మండపేట నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రాయవరం రూరల్ VSR డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు SSC, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర విద్యా, నైపుణ్య అర్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పుకొచ్చారు.

March 21, 2026 / 06:00 PM IST

కార్యకర్త మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

KRNL: సి.బెళగల్ మండల పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బోయ సోముడు రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఇవాళ సోముడు మృతి చెందిన విషయాన్ని టీడీపీ నాయకుల ద్వారా తెలుసుకున్న కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సోమన్న పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

March 21, 2026 / 05:59 PM IST

‘విద్యా రంగంపై సవతి తల్లి ప్రేమ’

NZB: విద్యా రంగంపై CM రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని AIFDS జాతీయ కన్వీనర్ రాజశేఖర్ శనివారం ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్నారు. కానీ నిన్నటి బడ్జెట్‌లో 8.22% మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

March 21, 2026 / 05:55 PM IST

మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేసిన ఛైర్మన్

KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన మహిళా సిబ్బందికి ఆలయ ఛైర్మన్ ఇంగిలె రామారావు చీరలను పంపిణీ చేశారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు మహిళా ఉద్యోగులకు ఆయన తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన చీరలను కానుకగా అందజేశారు. ఆలయ సేవలో తరిస్తున్న సిబ్బందికి చిన్నపాటి సాయం అందించానన్నారు.

March 21, 2026 / 05:52 PM IST