• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

IPL MVP అవార్డ్.. కోహ్లీకి ఒక్కసారే

IPL టోర్నీలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఇచ్చిన మాదిరే.. ఫీల్డింగ్, బౌండరీలతో ఆటపై ఇంపాక్ట్ చూపించే ప్లేయర్లకు MVP అవార్డ్ అందిస్తారు. గత 18 సీజన్లుగా ఆడుతున్న ధోనీ, కోహ్లీ, రోహిత్, మనీస్ పాండేలలో.. కోహ్లీ మాత్రమే 2016లో ఈ అవార్డ్ అందుకున్నాడు. ఇక సునీల్ నరైన్ అత్యధికంగా 3 సార్లు(2012, 18, 24) దీన్ని అందుకోగా.. వాట్సన్, రసెల్ తలో 2 సార్లు తీసుకున్నారు.

March 21, 2026 / 05:13 PM IST

గ్యాస్ గోడౌన్‌‌ను తనిఖీ చేసిన తహశీల్దార్

KRNL: తుగ్గలిలోని ఇండియన్ విష్ణు ప్రియ ఏజెన్సీని ఇవాళ తుగ్గలి తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను, గోడౌన్ తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. మండలంలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు బుకింగ్ అయినా తర్వాతే రావాలని అన్నారు. గృహ వినియోగదారులు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.

March 21, 2026 / 05:13 PM IST

ఉగాది పురస్కార గ్రహీతలకు ఎమ్మెల్యే ప్రశంసలు

ATP: జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలిపిన ఉగాది పురస్కార గ్రహీతలను MLA దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. త్యాగరాజ సంగీత సభ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు ఎర్రిస్వామి, జర్నలిస్టు రవిచంద్ర, పౌరాణిక నటుడు తిరుపాల్ నాయక్లను సత్కరించారు. ఐటీ ఉద్యోగం వదిలి సాగులో రాణించిన ఎర్రిస్వామి నిజాయతీకి నిదర్శనమైన రవిచంద్ర, కళాకారుడు తిరుపాల్ నాయక్ సేవలను కొనియాడారు.

March 21, 2026 / 05:13 PM IST

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న MLAలు

WGL: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పట్టణంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రియాజ్, WGL జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, HNK జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిలుగా MLAలు నాయిని, KR నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని, విందును స్వీకరించారు.

March 21, 2026 / 05:12 PM IST

బొత్సను కలిసిన మాజీ డిప్యూటీ సీఎం

PPM: ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరంలోని బొత్స నివాసానికి వెళ్లిన ఆయన, మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.

March 21, 2026 / 05:12 PM IST

శిక్షణను పూర్తి చేసుకున్న కలెక్టర్

BHPL: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాల్ బహాదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో నిర్వహించిన “డిజిటల్ రూపాంతరణ కోసం ఏఐ ఛాంపియన్స్ ప్రోగ్రామ్”ను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజయవంతంగా పూర్తి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ ద్వారా జిల్లా పరిపాలనను మరింత సమర్థవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

March 21, 2026 / 05:12 PM IST

తమ్మడపల్లెలో పెద్దమ్మ జాతరకు ఏర్పాట్లు

NDL: మహానంది మండలం తమ్మడపల్లెలో జూన్ 2, 3వ తేదీల్లో పెద్దమ్మ జాతర మహోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇవాల గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఈనెల 24న మొదటి ముడుపు కట్టేందుకు ముహూర్తం నిర్ణయించామన్నారు. జూన్ 18వ తేదీ వరకు 16 రోజుల పండుగ ఉంటుందని, అంతవరకు ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదని చెప్పారు.

March 21, 2026 / 05:12 PM IST

కేంద్ర మాజీమంత్రికి ఎమ్మెల్యే నివాళులు

SKLM: హైదరాబాద్‌లో కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు పెద్ద కర్మ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. వారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 21, 2026 / 05:11 PM IST

‘బ్రిడ్జిని సత్వరమే ప్రారంభించాలి’

VZM: వేపాడ మండలం కృష్ణ రాయుడుపేట వద్ద నిర్మించిన బ్రిడ్జిని సత్వరమే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న కోరారు. ఈమేరకు శనివారం బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం పూరై నెల రోజులు కావస్తున్న ప్రారంభించకపోవడంతో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.

March 21, 2026 / 05:11 PM IST

‘డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవు’

KDP: గృహవసరాల సిలిండర్లను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని ఖాజీపేట మండల తహశీల్దార్ రమణమ్మ ఇవాళ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. దుకాణదారులు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎటువంటి జాప్యం ఉండదన్నారు.

March 21, 2026 / 05:11 PM IST

బీజేపీలో చేరిన వ్యాపారవేత్త

అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) శనివారం బీజేపీలో చేరారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు 100 మందికి పైగా అనుచరులు పార్టీలో చేరారు. మోదీ నాయకత్వంపై ఆకర్షితులై ప్రజా సేవ కోసం చేరినట్లు ఎం.వి.ఆర్ తెలిపారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మాధవ్ సూచించారు.

March 21, 2026 / 05:11 PM IST

హత్యకు గురైన సమ్మక్క కుటుంబానికి MLA పరామర్శ

ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో ఇటీవల హత్యకు గురైన ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని MLA హరీష్ బాబు పరామర్శించారు. MLA మాట్లాడుతూ.. నిందితులను వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ఒక వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగిందని, ఈ హత్యలో పాత్ర ఉన్నావారందరిని చట్టం ముందు నిలబెడుతామన్నారు. ఈ మేరకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

March 21, 2026 / 05:11 PM IST

అడవుల రక్షణకు తోడ్పాటునందించాలి: FRO

NRML: అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి కోరారు. అంతర్జాతీయ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉడుంపూర్ రేంజ్ పరిధిలో సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్త మానవాళికి అడవులు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

March 21, 2026 / 05:08 PM IST

అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం

WNP: భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గాను వివిధ కేటగిరిల్లో అగ్ని వీర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల కేవలం www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

March 21, 2026 / 05:07 PM IST

‘షహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతిని జయప్రదం చేయాలి’

MDK: చేగుంట మండలం బోనాల అమరుల స్తూపం వద్ద షహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి కరపత్రాన్ని రైతు కూలీ సంఘం ఆవిష్కరించింది. షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్‌ల అమరత్వాన్ని 23న పల్లె పల్లెనా సామ్రాజ్యవాద అధర్మం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సభలు సమావేశాలు నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు బోనాల స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సూరంపల్లి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 05:07 PM IST