NZB: డొంకేశ్వర్ మండల కేంద్రంలోని PM SHRI ZPHS విద్యార్థులు తయారు చేసిన హిందీ మ్యాగజైన్‌ను హెఎం సురేశ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, క్రీడారంగం, సినిమా రంగం, పిల్లలకు ఇష్టమైన పద వినోదం, విద్యార్థుల సృజనాత్మకతో హిందీ భాషలో కథలు, ఎన్నో అంశాలను తీసుకుని సుందరంగా తయారు చేసినట్లు చెప్పారు.
TG: తెలుగు ఇండస్ట్రీకి.. సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది అనే ఆరోపణలు వస్తున్నాయి. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు మంత్రి అనుమతి లేకుండానే నిర్ణయాలు జరుగుతుండగా.. ఇటీవల జరిగిన గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో సినిమాటోగ్రఫీ శాఖలో కోమటిరెడ్డి పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
AKP: నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్‌కు ఈనెల 23న శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పండగ చేసుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక జడ్పీ అతిథి గృహంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కూటమి ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించేందుకు 50 బస్సులు కేటాయించినట్లు తెలిపారు.
VSP: గరికపాటి నరసింహారావు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని AISF డిమాండ్ చేసింది. శనివారం జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ పథకం వల్ల పేద విద్యార్థుల ఆకలి తీరి చదువుకు దోహదం అవుతుందని తెలిపారు. అలాగే, గుడ్డు ద్వారా పోషకాహారం లభిస్తుందని చెప్పారు.
BHPL: కాటారం మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కాంప్లెక్స్‌లో శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ క్షేత్రాధికారి జె. స్వాతి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటింటా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. డిప్యూటీ రేంజర్లు సురేందర్, శ్రీనివాస్, బీట్ అధికారులు ఉన్నారు.
ASF: దహెగాం మండలం చంద్రపల్లి సర్పంచ్ కొండపల్లి కస్తూరి, ఆమె అనుచరులతో కలిసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి MLC దండే విఠల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు ఆమె పేర్కొన్నారు.
KMR: బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను శనివారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
VZM: గుర్ల మండలం జమ్మూపేట గ్రామంలో శనివారం శ్రీ మహాగణపతి, షిర్డీసాయి, హనుమత్, లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
SKLM: డీఆర్‌ఎన్ కళాశాల తొలి ప్రిన్సిపాల్ కొర్లాం పార్వతీశం (82) శనివారం తుదిశ్వాస విడిచారు. నరసన్నపేట పట్టణం మారుతీ నగర్-2లోని ఆయన నివాసంలో పార్థివదేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 1999 నుంచి 2010 వరకు ప్రిన్సిపాల్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
NLG: నాగార్జునసాగర్ ఆయకట్టు మండలాల్లో ప్రస్తుతం వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కోసం వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ట్రాక్టర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఈ యంత్రాన్ని బిగించి, కోత మిషన్లు కోసిన వరిగడ్డిని కట్టలుగా తయారు చేస్తున్నారు. అందరూ ఒకే సారి అవసరం రావడంతో ఈ యంత్రాలకు డిమాండ్ పెరిగింది.
KMM: తెలంగాణ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ శనివారం ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో విద్యారంగంపై చేసిన ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. ప్రసంగంలో తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు.
BHNG: తాజ్ పూర్ గ్రామానికి చెందిన పేద ముస్లిం ఒంటరి మహిళ అయిన షేక్ అమీనాబి ఆవాసం లేక చాలా ఇబ్బంది పెడుతుంది. ఆమె పరిస్థితి చూసి ఆమెకోసం గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా స్వంత ఖర్చుతో సామాజిక వేత్త డా. ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మించి ఇచ్చి చేయూతనిచ్చారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గృహప్రవేశం చేశారు.
JGL: గొల్లపల్లి మండల ఎస్సీ,ఎస్టీ, బీసీ జేఏసీ కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మనాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా తాడురీ శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షుడిగా ఏనుగందుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా బాలే అశోక్ ఎన్నికయ్యారు. బహుజనుల హక్కుల సాధన కోసం ఈ కమిటీలు కృషి చేస్తాయని నాయకులు పేర్కొన్నారు.
KDP: ఆంధ్ర జెస్యూట్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ ఆర్.జాన్ ఇవాళ పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాలను సందర్శించారు. 30 అధునాతన కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన క్వాంటం టెక్నాలజీ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని మూడు మ్యూజియంలను సందర్శించి, అక్కడ భద్రపరిచిన అరుదైన చారిత్రక వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు.
JN: నర్మెట్ట మండలంలోని ఆగాపేట గ్రామంలో ఈనెల 23వ తేదీన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. వైద్య శిబిరానికి హాజరుకావాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రామ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ అనిల్ కుమార్ ఆహ్వానం అందజేశారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.