KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో నూతన 11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని శనివారం సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, ఎఫ్ఎవో కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషితో మంజూరైన ఈ ఉపకేంద్రాన్ని ఎకో టూరిజం పార్క్ సమీపంలో నిర్మించేందుకు పంచాయతీ తీర్మానం చేసింది. స్థలానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు తెలిపారు.
GNTR: దుగ్గిరాల మండలం పెదపాలెం శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని ధర్మకర్తలు వాసిరెడ్డి దుర్గాప్రసాద్, పుతుంబాక సత్యసాయికృష్ణ, వాసిరెడ్డి శ్రీకృష్ణ, నాగార్జున తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
ఆంజనేయాసనం(లో లంజ్ పోజ్) తుంటి కీళ్లను సాగదీయడం, కాళ్ల కండరాలను బలపరచడంలో పనిచేస్తుంది. సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల బిగుసుకుపోయిన తుంటి కీళ్లను లోతుగా సాగదీసి, వాటి కదలికను మెరుగుపరుస్తుంది. వెన్నెముకను సాగదీసి, బలోపేతం చేయడం ద్వారా వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీని, భుజాలను వెడల్పు చేసి, మంచి శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం సులభమవుతుంది.
SRPT: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు ఏ మాత్రం బడ్జెట్ ఆశాజనకంగా లేదన్నారు.
BHNG: హైదరాబాద్‌లోని నార్సింగ్‌కు చెందిన అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం యాదగిరిగుట్టకు వచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో అనిత కొండపై ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. సడెన్‌గా బస్సు కదిలింది. ఈ క్రమంలో అనిత కిందపడటంతో బస్సు ఆమె కాలు మీదుగా వెళ్లింది. ఆమెకు కాలుకు స్వల్పంగా గాయాలయ్యాయి.
అన్నమయ్య: గాలివీడు మండలం గండిమడుగులో శనివారం ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. నంది మండలానికి చెందిన అనితమ్మ (69) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లక్కిరెడ్డిపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: ఎంపీ డీకే అరుణ శనివారం జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ప్రారంభించారు. పోచమ్మగుడి ఊరచెరువు అభివృద్ధికి అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.కోటి,11లక్షల నిధులతో చేపట్టబోయే పనులకు ఆమె భూమిపూజ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
WG: తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు రాసిన చేతనాకేతనం పద్య కవిత సంపుటి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం రాత్రి ఆవిష్కరించారు. సజ్జాపురం రామకృష్ణ మఠం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాహితీ వినీలాకాశంలో తణుకును తళుక్కుమనేలా చేసిన అద్భుత సాహితీ ప్రతిభాశాలి అని కొనియాడారు.
VKB: మోమిన్‌పేట మండల కేంద్రంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు అధ్వాన్నంగా తయారవ్వడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి వచ్చే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనాదారులు కోరుతున్నారు.
SKLM: మాదక ద్రవ్యాలు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాలు, ప్రభుత్వం నిషేధించిన వాటిని ఎవరైనా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
NDL: ప్యాపిలి మండలం బురుగులలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఆ విరాళాన్ని డోన్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలయ నిర్వాహకులకు శనివారం అందజేశారు. ఆలయ పునరుద్ధరణకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
MDK: నార్సింగి మండలం షేర్ పల్లి గ్రామానికి చెందిన పంబల శ్యామల వైద్య చికిత్స నిమిత్తం మైనంపల్లి రోహిత్ రావు తన ఉదారతను చాటుకున్నారు. బాధితురాలి కుటుంబానికి మంజూరైన రూ. 2,50,000 ఎల్వోసీ (LOC) పత్రాన్ని ఆయన స్వయంగా అందజేశారు. శ్యామల త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తమకు అండగా నిలిచిన రోహిత్ రావుకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
VSP: ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖపట్నాన్ని ప్రధాన సినీ నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
MLG: కన్నాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని ముప్పనపల్లి ఫీడర్‌లో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తవ్వగానే విద్యుత్ సరఫరా పునః ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
TPT: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో శనివారం గరుడ సేవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమధుర భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ పరిసరాలు రామనామంతో మారుమోగాయి.