• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాసేపట్లో కవిత మీడియా సమావేశం

TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్‌కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో విముక్తిపై స్పందించనున్నారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత సహా కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకు విముక్తి లభించిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 11:58 AM IST

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన నూతన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త కలెక్టర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

February 27, 2026 / 11:58 AM IST

కుల్కచర్లలో తడి-పొడి చెత్త బుట్టల పంపిణీ

VKB: స్వచ్ఛ గ్రామాల లక్ష్యంతో కుల్కచర్ల మండలంలోని చెరువు ముందలితండా గ్రామపంచాయతీలో శుక్రవారం తడి, పొడి చెత్త కోసం వేర్వేరు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, వ్యర్థాలను వేరు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని శుభ్రతపై అవగాహన పెంపొందించారు.

February 27, 2026 / 11:57 AM IST

‘విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి’

PPM: కురుపాంలోని గురుకుల పాఠశాలలో డయోరియా బారిన పడిన నలుగురు గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అదే పాఠశాలలో గతంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఇంకా ఆ పాఠశాలలో స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేదన్నారు.

February 27, 2026 / 11:56 AM IST

సరైన పత్రాలు లేకుంటే చిక్కుల్లో పడతారు: ఏలూరు సీఐ

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీలో సీఐ అశోక్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో 8 ప్రత్యేక బృందాలతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు.

February 27, 2026 / 11:56 AM IST

పాలకుర్తి ఎస్సైకు ఘన వీడ్కోలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలో 42 ఏళ్లపాటు పోలీస్ శాఖలో సేవలందించిన పాలకుర్తి ఎస్సై శ్రీ ఎం.లింగారెడ్డి ఈనెల 28న పదవీ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం యువకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సేవాకాలంలో సుమారు 150 రివార్డులు అందుకున్న లింగారెడ్డి బస్‌స్టాండ్ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యువకులు పాలాభిషేకం చేశారు.

February 27, 2026 / 11:55 AM IST

ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి సోదరుడి దాడి

MDCL: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై కొందరు దుండగులు దాడి చేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్‌ను రామలింగంపల్లి గ్రామ శివార్‌కు పిలిపించి యువతి సోదరుడు, అతని స్నేహితులు కారం చల్లి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

February 27, 2026 / 11:54 AM IST

రేపు జాతీయ సైన్స్ దినోత్సవం: డీఈవో

NLG: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సంబరాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తెలిపారు. పాఠశాలల్లో సెమినార్లు, పరిశోధనలపై అవగాహన, సైన్స్ ప్రయోగాలు, వ్యాసరచన, క్విజ్ పోటీలు, పుస్తకాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

February 27, 2026 / 11:53 AM IST

పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పారా మెడికల్ పోస్టులు పరీక్ష తేదీలను సవరించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 10 నుంచి 12 వరకు జరగాల్సి ఉన్నాయి. కానీ, తాజా ప్రకటన ప్రకారం ఈ  పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్ట్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

February 27, 2026 / 11:52 AM IST

ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ‘జనతా వారధి’

E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, యానాపు ఏసు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల ఆక్రమణ, పింఛన్ల తదితర సమస్యలపై పలు వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

February 27, 2026 / 11:50 AM IST

ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైరు చోరీ

SRD: రాయికోడ్ మండలం పంపాడు గ్రామ శివారులోని మిషన్ భగీరథకు సంబంధించిన ఇంటెక్వల్ వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న ట్రాన్సఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.1.50 లక్షల విలువ గల ఆయిల్, కాపర్ వైరును ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

February 27, 2026 / 11:49 AM IST

రంజీ ట్రోఫీ ఫైనల్.. కర్ణాటక ఆలౌట్

రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఇబ్బందుల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (86*) రాణించినప్పటికీ, జమ్మూ బౌలర్ల ధాటికి 3వ రోజు ఆట ముగిసే సమయానికి 293 పరుగులకే కర్ణాటక ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం కర్ణాటక జట్టు 291 పరుగుల వెనకంజలో ఉంది. కాగా, జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 11:48 AM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి

KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గామాత ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని, అమ్మ దయా కరుణా కటాక్షాలతో తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి ప్రార్థించారు.

February 27, 2026 / 11:46 AM IST

వార్నర్ బ్రదర్స్‌తో డీల్‌.. వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునే రేసు నుంచి నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. కొనుగోలు ఆఫర్ మొత్తాన్ని పెంచేందుకు నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి చూపకపోవడంతో ఈ డీల్ నిలిచిపోయింది. దీంతో, ట్రంప్‌తో అనుబంధం ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థతో ఈ ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో కూడిన ఈ డీల్ ఇప్పుడు మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

February 27, 2026 / 11:46 AM IST

బస్సు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (57) తీవ్రంగా గాయపడ్డారు. బస్సు స్కూటర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకున్నారు.

February 27, 2026 / 11:45 AM IST