• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం మూసివేత

E.G: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం మూసివేశారు. ఉదయం 9:30 గంటలకు ఆలయ ద్వారాలను మూసినట్లు సహాయ కమిషనర్ బి.హరి సూర్య ప్రకాశ్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రహణం కారణంగా ఇవాళ జరగాల్సిన అన్ని పూజా కార్యక్రమాలు రద్దు చేసినట్లు దేవులపల్లి రవిశంకర్ తెలిపారు.

March 3, 2026 / 11:41 AM IST

మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే.. రంగుపడుద్ది

HYD: హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.

March 3, 2026 / 11:40 AM IST

రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు హోలీ విషెస్

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చెడుపై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హోలీ పండుగ సందర్భంగా అందరికి మరోసారి విషెస్ తెలుపుతున్నా’ అని పోస్ట్ చేశారు.

March 3, 2026 / 11:40 AM IST

నాగలక్ష్మి ఆలయంలో చోరీ.. రూ.20 వేల విగ్రహాలు అపహరణ

MLG : ఏటురూనాగారం మండలం ఆకులవారి ఘనపురం గ్రామంలోని నాగలక్ష్మి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసిన తలుపులు పగలకొట్టి లోపల ఉన్న విగ్రహాలు, ఇతర వస్తువులు అపహరించారు. దొంగిలించిన విగ్రహాల విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందని స్థానికులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరా ఫుటేజీ అందజేశారు.

March 3, 2026 / 11:39 AM IST

వేములవాడ లో ఘనంగా హోలీ వేడుకలు

SRCL: వేములవాడ పట్టణంలోహోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణంలో హోలీ పండుగ సంబరాలు సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. హోలీ పండగ సందర్భంగా వివిధ రకాల రంగులతో ఒకరికొకరు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరు ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు.

March 3, 2026 / 11:39 AM IST

జర్నలిస్టులతో కలిసి ఎస్సై సాయిబాబు హోలీ సందడి

WGL: వర్ధన్నపేట పట్టణంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో జరిగిన వేడుకల్లో ఎస్సైసాయిబాబు స్థానిక జర్నలిస్టులతో కలిసి రంగులు పూసుకుని హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు, సమాచార ప్రసారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు పరస్పర సత్సంబంధాలను పెంపొందిస్తాయి.

March 3, 2026 / 11:39 AM IST

శ్రద్ధా కపూర్ సంపాదన ఎంతో తేలుసా?

శ్రద్ధా కపూర్ 2010లో సినీరంగంలోకి వచ్చి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో వచ్చిన విజయాలతో ఆమె నికర సంపద రూ.130 కోట్లకు చేరింది. ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు తీసుకుంటూ, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపార పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు. లగ్జరీ కార్లు కలిగి, అధిక పారితోషికం అందుకుంటున్న టాప్ నటీమణులలో ఆమె ఒకరిగా నిలిచారు.

March 3, 2026 / 11:38 AM IST

పెద్దారికట్ల హాస్టల్ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు మరియు పారిశుద్ధ్యాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఆయన ఆహార నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు.

March 3, 2026 / 11:38 AM IST

నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలి : DMHO

KMM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులను (నార్మల్ డెలివరీలను) ప్రోత్సహించాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డి.రామారావు ఆదేశించారు. జిల్లాలో సీ-సెక్షన్లు ఎందుకు పెరుగుతున్నాయో ప్రతి కేసును ఆడిట్ చేయాలన్నారు. ప్రభుత్వ పీహెచ్‌సీలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకుని లక్ష్యాలను పూర్తి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

March 3, 2026 / 11:38 AM IST

నిరూపయోగంగా బస్ షెల్టర్

SKLM: సారవకోట మండలంలోని తొగిరి గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్ నిరూపయోగంగా ఉంది. వడ్డినవలస నుంచి బుడితి వెళ్లే ఈ మార్గంలో కొన్నేళ్ల క్రితం బస్సు నడిచేది. ఆ సమయంలో ప్రయాణికులు నిరీక్షించేందుకు ఈ షెల్టర్ నిర్మించారు. కానీ ప్రస్తుతం ఆ బస్సు ఇప్పుడు లేకపోవడంతో నిరూపయోగంగా మారింది. దీంతో స్థానికులు కర్రలు, ద్విచక్ర వాహనాలు భద్రపర్చుకుంటున్నారు.

March 3, 2026 / 11:37 AM IST

సామాజిక సేవకు గుర్తింపు..!

KNR: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ ఉత్తమ ఆప్టోమెట్రిస్ట్ గోల్డెన్ నంది అవార్డు-2026ను మాజీ కార్మిక శాఖ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా నిన్న అందుకున్నారు. ఓ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ మ్యూజియం భాస్కర ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

March 3, 2026 / 11:37 AM IST

‘హోలీ పండుగ సురక్షితంగా జరుపుకోవాలి’

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ 19 డివిజన్ చిట్టీ రామవరం గ్రామంలో మంగళవారం హోలీ పండుగను మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ అట్టహాసంగా జరుపుకున్నారు. స్థానికులతో కలిసి హోలీ పండుగలు ఎటువంటి మనోభావాలు, దెబ్బ తినకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు రంగులు పంపిణీ చేసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

March 3, 2026 / 11:36 AM IST

హైకోర్టుకు బాంబు బెదిరింపులు

TG: హైకోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. . అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల నుంచి జడ్జీలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించి బాంబ్, డాగ్  స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కాగా గత కొన్ని రోజులుగా పలు చోట్ల బాంబులు పెట్టినట్లు వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి.

March 3, 2026 / 11:35 AM IST

గండేపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు

NTR: కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో సర్పంచ్ బొక్క రవికుమార్ ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు కార్యక్రమం జరిగింది. రోడ్లు, డ్రేన్లు శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లి, సానిటైజేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో మెరుగైన పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం చేపట్టామని సర్పంచ్ తెలిపారు.

March 3, 2026 / 11:35 AM IST

ఆకివీడు సీఐ జగదీశ్వరరావు సస్పెండ్

WG: ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ నిందితుడు సుధీర్ వర్మపై వచ్చిన ఫిర్యాదులో పోక్సో (POCSO) కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాగా, 2024 ఆగస్టులో ఆకివీడు సీఐగా నియమితులయ్యారు.

March 3, 2026 / 11:34 AM IST