NLR: నెల్లూరు కార్పొరేషన్ నూతన మేయర్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఎన్నికకు వైసీపీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మాజీ మేయర్ స్రవంతి ఒంటరిగా, మౌనంగా కూర్చుండిపోయారు. అదే సమయంలో టీడీపీ కార్పొరేటర్లు జోష్ మీద వచ్చారు. నూతన మేయర్‌గా సుజాత ఎన్నికకావడంతో ఆమె సంతోషంగా కనిపించారు.
NLG: వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు సూర్యపెల్లి జ్యోతి శ్రీను నూతన ఇందిరమ్మ ఇళ్ళు ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్లు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
NZB: జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ హాల్లో సాగుతున్న కొత్త సర్పంచుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగియనుంది. జనవరి 19న ప్రారంభమైన ఈ శిబిరంలో పంచాయతీరాజ్ చట్టం, పాలనాపరమైన అంశాలపై అధికారులచే అవగాహన కల్పించారు. ఈరోజు కొనసాగిన శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు తమ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని జిల్లా అధికారులు దిశానిర్దేశం చేశారు.
NZB: తాగుడుకు బానిసై మనస్తాపంతో ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన న్యాల్కల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు వెంటనే 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రకాశం: పామూరు మండల సర్వసభ్య సమావేశం మార్చి 1 వ తేదీన జరుగుతుందని డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ ఆలీ తెలియజేశారు. ఎంపీపీ గంగసాని లక్ష్మి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు. మండలంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సర్పంచులు హాజరుకావాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాలని సూచించారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మురికి నీరు రోడ్డుపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 39వ వార్డులో మురికి కాలువలో నుంచి నీరు రోడ్డుపై ప్రవహించడంతో కాలనీ వాసులతోపాటు ద్విచక్ర వాహనదారులు, ప్రజలు నడిచేందుకు ఇబ్బందుల గురవుతున్నారు. సిబ్బంది వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
AKP: పాయకరావుపేట మండలంలో రబీలో సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు 92% పూర్తయినట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గురువారం తెలిపారు. 1,110 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతులకే రైతు సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు, మాజీ ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్, తదితరులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
KRNL: జిల్లాలోని బేడబుడగ జంగాల సమస్యలను కోడుమూరు MLA దస్తగిరి ఇవాళ అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న వీరు ఆర్థికంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకం కలుగుతోందని వివరించారు. ఇదే సమయంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే చిరకాల కోరికను నెరవేర్చాలని కోరారు.
అన్నమయ్య: పాలకుల కుట్రలకు ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు బలవుతున్నారని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. ఆయన గురువారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మద్యం పాలసీపై అప్పటి సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలపై వైసీపీ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మళ్లీ టీడీపీ రాగానే ఆ కేసులను క్లోజ్ చేయడం ఎంతవరకు సబబన్నారు.
లండన్‌లో ట్యాక్సీ డ్రైవర్ కావడం సివిల్ సర్వీసెస్ పరీక్ష అంత కఠినం. అభ్యర్థులు దాదాపు 25 వేల వీధులు, వేల సంఖ్యలో ల్యాండ్‌మార్క్‌లను కంఠస్థం చేయాలి. ఈ నైపుణ్యం కోసం కనీసం మూడేళ్లు కష్టపడాలి. 160 ఏళ్ల నాటి ఈ పరీక్ష ద్వారా నగర భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారికే లైసెన్స్ ఇస్తారు. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవింగ్ పరీక్షగా పరిగణిస్తారు.
ADB: జైనథ్ మండల విద్యాశాఖ అధికారి MEO శ్రీనివాస్ బెల్లూరి పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పర్యవేక్షించిన ఆయన, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, మౌలిక వసతులపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.
HYD: మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం నేతృత్వంలో ప్రొ. కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి, త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వాటి అమలుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఇవాళ సిట్ అధికారులు ఎదుట లొంగిపోయారు. రాజ్ కేసిరెడ్డికి సమీప బంధువైన అవినాష్, గత కొంతకాలంగా పరారీలో ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అధికారుల ఎదుట లొంగిపోయారు.
KRNL: దేవనకొండ మండలం కరివేములలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ దేవాలయానికి ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ రూ.20వేల విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే సేవాభావాన్ని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.