SRD: రాయికోడ్ మండలం పంపాడు గ్రామ శివారులోని మిషన్ భగీరథకు సంబంధించిన ఇంటెక్వల్ వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడ ఉన్న ట్రాన్సఫార్మర్ను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.1.50 లక్షల విలువ గల ఆయిల్, కాపర్ వైరును ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్ఐ అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.