CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
SKLM: పాతపట్నంలో ఉన్న డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి వచ్చే నెల 2వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్లు ప్రిన్సిపల్ పి. పద్మావతి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్షలు గతంలో ప్రకటించిన మేరకు 1వ తేదీన నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
యువతను ఆకట్టుకున్న తమిళ బోల్డ్ మూవీ ‘హాట్‌స్పాట్ 2 మచ్’ ఇప్పుడు తెలుగులో అలరించనుంది. దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తెరకెక్కించిన ఈ మూవీ ‘హాట్ స్పాట్'(2024)కు సీక్వెల్‌గా రూపొందింది. నేటి సమాజంలోని వివాదాస్పద అంశాల నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తమిళ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. FEB 27 నుంచి ఆహాలో దీని తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.
WNP: కొత్తకోట మండలంలోని పామాపురంలో 33/11 KV నూతన విద్యుత్ సబ్స్టేషన్‌ను ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. సబ్‌స్టేషన్ ప్రారంభం తర్వాత గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తొలగి, రైతులకు నాణ్యమైన కరెంటు అందుతుందని తెలిపారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పల్లె పాగ ప్రశాంత్, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విజయ్, రష్మిక దంపతులు కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా తమ రిసెప్షన్ వేడుకకు రావాలని కోరారు. FEB 26న పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 4న జరగనుంది. HYDలోని తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను SM వేదికగా షేర్ చేశారు.
GNTR: కొత్తపేట పోలీసులు తెల్లవారుజామునే వెంకటాద్రి పేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 54 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ఆయన వివరించారు.
PLD: ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ భేటీలో, వారు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో అందిన ప్రజా దరఖాస్తుల స్థితిగతులపై రూపొందించిన సమగ్ర నివేదికలను మంత్రి లోకేశ్ వారికి అందజేశారు.
VZM: కొత్తవలసలోని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ దుకాణదారుడు తన ఇల్లు, షాపులు తనఖా పెట్టి ఎస్.బి.ఐ నుంచి రూ 36 లక్షలు 2019లో రుణం తీసుకొన్నారు. బ్యాంకు కట్టవలసిన వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో గురువారం రికవరీ బృందం వచ్చి షాపులు, గృహానికి తాళాలు వేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో, చీఫ్ మేనేజర్, పోలీసులు పాల్గొన్నారు.
HYD: నగరంలో గాలి నాణ్యతలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం తగలబెట్టడం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం వట్టినాగులపల్లిలో 234గా రికార్డ్ అయింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
NDL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో శుక్రవారం ఉదయం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం నుంచి బాధితులను శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
KMM: సత్తుపల్లి సైబర్ నేరం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాధితుడి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో గతంలోనే 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, తాజాగా పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు కలిగి, అమాయకుల ఖాతాల ద్వారా భారీగా నిధులు మళ్లించిన ఈ ముఠాపై దర్యాప్తు కొనసాగుతుంది.
KNR: హుజురాబాద్ మండలం సింగాపురంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ గౌస్ ఆలం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచనలు సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐ కరుణాకర్, MVI వేణు, అధ్యాపకులు పాల్గొన్నారు.
MNCL: మంచిర్యాల స్థానిక ప్రభుత్వ ITIలో PMKVY 4.0 కింద పలు కోర్సుల్లో నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. CNC ఆపరేటర్ (టర్నింగ్), ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో 3నెలలు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు అన్నారు. మార్చ్ 3లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NRML: జిల్లాలో గిరిజనుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్‌లో గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో వివరించారు. కమిషన్ సూచనల మేరకు గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి, పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఇందులో జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తుదితులు పాల్గొన్నారు.
NTR: తిరువూరు లైన్ బజారు ప్రాంతంలో అల్లాహ్ దైవ సేవకురాలు అబిదా ఖాతూన్ నివాసంలో రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబిదా ముస్లిం పేద మహిళలకు రంజాన్ తోఫాలను మహిళలకు అందజేశారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.