• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి: మంత్రి

MLG: ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామ సమస్యలను త్వరగా పరిష్కరించి శుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఆదాయాభివృద్ధిపై దృష్టి పెట్టి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. 5 రోజుల శిక్షణ పొందిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేశారు.

February 27, 2026 / 09:01 AM IST

‘గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేస్తా’

ADB: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతోందని జిల్లా ఉప విద్యాధికారి గోడం చందన్ అన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన విద్యాశాఖ ఉప విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టారు. పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

February 27, 2026 / 09:01 AM IST

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు శుక్రవారం రావులపాలెం మండలం ఈతకోట వాస్తవ్యులు కలిదిండి సాయి మణికంఠ కుటుంబ సభ్యులు  రూ.50,000 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం అందజేశారు.

February 27, 2026 / 09:00 AM IST

నేటి నుంచి వీరవల్లిలో ఘనంగా శ్రీ తిరుపతమ్మ తిరునాళ్లు

కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లిలోని శ్రీ తిరుపతమ్మ, గోపయ్యగార్ల తిరునాళ్లు శుక్రవారం మొదలు కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి కల్యాణం జరగనుంది. సాయంత్రం మేళతాళాలు, కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ ప్రభల మధ్య అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది.

February 27, 2026 / 09:00 AM IST

‘ఆర్‌డీటీని కాపాడుకోవడం మనందరి బాధ్యత’

సత్యసాయి: RDT సంస్థను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సీ జన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లాయప్ప పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే వినయ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుళ్లాయప్పతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ సంస్థ పేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.

February 27, 2026 / 09:00 AM IST

ట్రోల్స్‌ ఎఫెక్ట్‌.. తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసలు

సౌత్ ఇండస్ట్రీలో తాను ఇబ్బంది పడినట్లు హీరోయిన్ తాప్సీ చేసిన వ్యాఖ్యలపై తెలుగు ప్రేక్షకులు విమర్శలు చేశారు. ‘సౌత్ సినిమాల వల్లే గుర్తింపు తెచ్చుకున్న నువ్వు, ఇప్పుడు అదే ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తాజాగా తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసలు కురిపించింది. తెలుగులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది.

February 27, 2026 / 09:00 AM IST

కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్

SKLMఫ ఏళ్ల తరబడి సాగుతున్న కేసులకు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ పరిష్కార మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శ్రీకాకుళం న్యాయసేవా సదన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మార్చి 14న వివిధ బెంచీల్లో లోక్ అదాలత్ నిర్వహించనుస్నట్లు పేర్కొన్నారు. ఆదాలత్‌లో కేసుల రాజీకి ఇరువర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు .

February 27, 2026 / 08:59 AM IST

చాయ్ చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

JN: పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో NECC సహకారంతో ఎగ్ కార్టూన్‌లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఓ షాపు వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వయంగా చాయ్ చేసి సందడి చేశారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజు పోషక విలువలు కలిగిన గుడ్డును తప్పనిసరిగా తినాలని అన్నారు.

February 27, 2026 / 08:56 AM IST

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ..

WGL: శాయంపేట(హ) గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ… ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని, గ్రామంలోని పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపీటీసీ బిక్షపతి ఉన్నారు.

February 27, 2026 / 08:53 AM IST

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

WGL: శాయంపేట(హ) గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. సర్పంచ్ యాకయ్య మాట్లాడుతూ… ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని, గ్రామంలోని పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపీటీసీ బిక్షపతి ఉన్నారు.

February 27, 2026 / 08:53 AM IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌!

AP: హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణకు 2 నెలలముందే కొత్త సీజేలను నియమించాలని నిర్ణయించింది. మద్రాస్, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌, మద్రాస్ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్‌ను సిఫారసు చేశారు.

February 27, 2026 / 08:52 AM IST

సైబర్ ముఠా అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

TG: రూ.547 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను రిమాండ్‌ను తరలించారు. కాగా ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 08:51 AM IST

నేడు కుమ్మెర గ్రామానికి ఎంపీ, ఎమ్మెల్యే రాక

NGKL: కుమ్మెర గ్రామాన్ని నేడు స్థానిక పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించనున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురానున్నారు.

February 27, 2026 / 08:50 AM IST

నేటితో ముగియనున్న పత్తి కొనుగోళ్లు

ASF: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గడువు పెంచడంతో రైతులు తమ పత్తిని అమ్ముకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. నేడు చివరి రోజు కావడంతో రైతులు వేగంగా పత్తిని అమ్మేందుకు తీసుకువస్తున్నారు.

February 27, 2026 / 08:50 AM IST

నగరిలో నలుగురు అరెస్ట్

CTR: నగరి మున్సిపాలిటీ దళితవాడలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సీఐ మల్లికార్జునరావు దాడులు చేసి,పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36,900 స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 27, 2026 / 08:50 AM IST