• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రజినీకాంత్ కొడుకుగా మలయాళ హీరో!

లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. శిబి చక్రవర్తి తెరకెక్కించనున్న ఈ మూవీలో మలయాళ దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ భాగం కానున్నాడట. ఇందులో రజినీ తనయుడు పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ప్రియాంక మోహన్ కూడా ఈ మూవీలో నటించనుందట. ఇక ఈ సినిమా షూటింగ్ 2026 ఏప్రిల్‌లో స్టార్ట్ కానున్నట్లు, 2027 సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు టాక్.

February 25, 2026 / 01:00 PM IST

16వ ఆర్థిక సంఘంపై HYDలో మేధోమథనం

TG: హైదరాబాద్‌లో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఆర్థికశాఖ, CESS ఆధ్వర్యంలో కీలక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావుతో పాటు మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితర ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటా, రాష్ట్రాల కార్యాచరణ, అభివృద్ధి వ్యూహాలపై ఈ సదస్సులో లోతుగా చర్చించారు.

February 25, 2026 / 12:56 PM IST

గిద్దలూరులో 2వ రోజు అంగన్వాడీల రిలే దీక్షలు

ప్రకాశం: గిద్దలూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీడీపీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం రెండోరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనీసవేతనం రూ. 26 వేలు అమలుచేయడం, వేతనంతో కూడిన వేసవి సెలవులు, మినీ అంగన్వాడీలను మెయిన్ వర్కర్లుగా గుర్తించడం, 4 లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లు చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు.

February 25, 2026 / 12:54 PM IST

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రథమ పరీక్ష

NRML: నిర్మల్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని డిఐఈఓ పరుశురాం తెలిపారు. జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసారని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రేపటి ద్వితీయ సంవత్సరం పరీక్షకు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

February 25, 2026 / 12:50 PM IST

సీఎస్ విజయానంద్‌పై హైకోర్టు సీరియస్

AP: సీఎస్ విజయానంద్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 పరీక్షలో ఎంపికైనవారిని సిట్ విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈనెల 11న ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.

February 25, 2026 / 12:49 PM IST

‘MLA కోవ లక్ష్మిపై అక్రమ కేసును ఎత్తివేయాలి’

ASF: ఆసిపాబాద్ ఆదివాసి మహిళ MLA కోవ లక్ష్మిపై క్యతన్ పల్లి సంఘటనలో A12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ MLA పై కేసు బనాయించడం దారుణమన్నారు. తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:49 PM IST

శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును తనిఖీ చేసిన కమిషనర్

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్క్‌ను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసినట్టు వివరించారు.

February 25, 2026 / 12:47 PM IST

పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

MDK: మెదక్ పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల వివిధ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:47 PM IST

‘పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా మల్లయ్య బాధ్యతలు’

పెద్దపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నూగిల్ల మల్లయ్య బుధవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

February 25, 2026 / 12:47 PM IST

‘తారకరామ ఎత్తిపోతలకు నిధులు విడుదల చేయాలి’

NTR: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన మైలవరం నియోజకవర్గానికి సాగునీటి వరప్రదాయిని తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెట్ట ప్రాంత రైతులందరూ ఈ పథకం పైనే ఆధారపడి పంటలను సాగుచేసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

February 25, 2026 / 12:45 PM IST

ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే

ASR: తిమ్మాపురం నుంచి భీమిలి బీచ్ వరకు ఉన్న ప్రాంతాన్ని CRZ-3 నుంచి CRZ-2కు మార్చాలని విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో కోరారు. CRZ-2కు మార్చకపోతే పర్యాటక అభివృద్ధి కష్టమవుతుందన్నారు. అలాగే 2014లో కేటాయించిన భూమిలో ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:45 PM IST

మృతురాలి కుటుంబానికి ఎంపీ ఆర్థిక సాయం

KDP: నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో మట్టి మిద్దె కూలి లక్ష్మిదేవమ్మ మృతికి నివాళులు అర్పించి, నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి పంపిన రూ.10 వేల నగదును టీడీపీ నాయకులు బుధవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:45 PM IST

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

VKB: యాలాల్ మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవానికి 108లో హాస్పిటల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్సును పక్కకాపి EMT నితిన్, పైలట్ మహేందర్ డెలివరీని విజయవంతంగా పూర్తి చేశారు. భాగ్యలక్ష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

February 25, 2026 / 12:44 PM IST

పుంగనూరులో అంగన్వాడి కార్యకర్తలు నిరసన

CTR: తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరులోని ICDS ప్రాజెక్టు కార్యాలయం వద్ద బైఠాయించి తమ నీరస తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 12:43 PM IST

పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

WNP: జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు.

February 25, 2026 / 12:43 PM IST