NTR: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన మైలవరం నియోజకవర్గానికి సాగునీటి వరప్రదాయిని తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెట్ట ప్రాంత రైతులందరూ ఈ పథకం పైనే ఆధారపడి పంటలను సాగుచేసుకుంటున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.