• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీకాకుళంలో తగ్గుముఖం పట్టిన డయేరియా

శ్రీకాకుళం నగరంలో ఐదు వార్డు సచివాలయాల పరిధిలో ఈనెల 23 నుంచి డయేరియా ప్రధాన సమస్యగా మారింది. గరిష్టంగా 102 కేసులు నమోదు కావడంతో యంత్రాంగాన్ని ఆందోళన గురి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం నాటికి కొంతవరకు తగ్గు ముఖం పట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి, ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.

February 26, 2026 / 10:30 AM IST

సిద్దిపేటలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

SDPT: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీలలో నిండుకున్న డ్రైనేజీలు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు.

February 26, 2026 / 10:29 AM IST

బొల్లారం మీదుగా రాయలసీమ ఎక్స్ ప్రెస్.. టైమింగ్స్ ఇవే..!

HYD: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజ్ కల్పించారు. తిరుపతి నుంచి సాయంత్రం 5:35 బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:40 సమయానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. బొల్లారం వచ్చేసరికి ఉదయం 6:15 అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో బొల్లారంలో సాయంత్రం 4:09 గంటలకు రైలు అందుబాటులో ఉంటుందని SCR అధికారులు తెలిపారు.

February 26, 2026 / 10:28 AM IST

తిరుపతి స్విమ్స్‌లో ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రిషియన్-62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. svimstpt.ap.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 10:28 AM IST

రెవెన్యూ డివిజనల్ అధికారి బదిలీ

KMM: ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి జి. నరసింహారావును జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మెట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్.శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీఓగా నియమించారు. పరస్పర బదిలీల్లో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.

February 26, 2026 / 10:28 AM IST

వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం

AP: వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఇరిగేషన్‌పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై మాకు చిత్తశుద్ధి ఉందని, వైసీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాగా, రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోతారని వైసీపీ పేర్కొంది.

February 26, 2026 / 10:26 AM IST

కె. గొల్లహట్టిలో తీరిన తాగునీటి కష్టాలు

SS: అమరాపురం మండలం కె. శివరం పంచాయతీ పరిధిలో ఉన్న కె. గొల్లహట్టి గ్రామస్తుల తాగునీటి సమస్య పరిష్కారమైంది. చాలా కాలంగా నీటి ఇబ్బందులతో సతమతమవుతున్న గ్రామం గురించి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. అధికారులను ఆదేశించి గురువారం తెల్లవారుజామున గ్రామంలో బోర్వెల్ వేయించారు.

February 26, 2026 / 10:26 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బదిలీ

BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బదిలీ అయినట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భద్రాద్రి జిల్లాకు నూతన కలెక్టర్గా నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పని చేస్తున్న అంకిత్‌ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ను నియమించారు.

February 26, 2026 / 10:26 AM IST

కళ్యాణ్ రామ్ తరువాతి ప్రాజెక్ట్‌పై క్రేజీ UPDATE

నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్టును దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో ఇప్పటికే లాక్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కానుందట. అదే ఏడాది చివరి నాటికి సినిమాను థియేటర్లలో విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.

February 26, 2026 / 10:26 AM IST

జిల్లా అదనపు కలెక్టర్‌గా జీవి శ్యామ్ ప్రసాద్ లాల్

NGKL: జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్ బాడీస్) జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలువురు అధికారుల బదిలీల్లో భాగంగా ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు వివిధ బాధ్యతల్లో తనదైన ముద్ర వేసిన ఆయన, ఇకపై జిల్లా పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

February 26, 2026 / 10:25 AM IST

మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్..!

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 10:24 AM IST

అనుమానాస్పదంగా మహిళ మృతి

AP: కర్నూలు జిల్లా పత్తికొండలోని కొండగేరివీధిలో విషాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మి(26) అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త, అత్తమామలు కొట్టి ఉరివేసి చంపారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అనారోగ్య కారణాల వల్ల ఉరివేసుకుని మృతిచెందినట్లు భర్త బంధువులు చెబుతున్నారు.

February 26, 2026 / 10:24 AM IST

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు

SRCL: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తిచేసిన పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు.

February 26, 2026 / 10:24 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు నేడు తెలుగు సాంస్కృత పరీక్షలను రాయనున్నారు.

February 26, 2026 / 10:22 AM IST

పేదింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరింది

RR: చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి కల ప్రజా ప్రభుత్వంలో నెరవేరిందని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పక్కా ఇంటిని నిర్మించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 10:22 AM IST