• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముచింతల్ శిక్షణలో సర్పంచ్‌కు సర్టిఫికేట్

RR: స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్‌లో 2026 నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఐదు రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ గన్నోజు వేణుగోపాల్ రంగారెడ్డి జిల్లా డీపీవో చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ అందుకున్నారు. అనంతరం డీపీవోని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నేర్చుకున్న విషయాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

February 28, 2026 / 08:16 AM IST

బాన్సువాడలో జనసేన సభ్యత్వ నమోదు

KMR: బాన్సువాడలో జనసేన ఇన్‌ఛార్జ్ రవీందర్ చౌహన్ పట్టణంలోని గౌలిగూడ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి జనసేన సభ్యత్వాన్ని ప్రారంభించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి రూ.ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా అడుగులు వేస్తామన్నారు.

February 28, 2026 / 08:15 AM IST

బాల్య వివాహలపై అవగాహన సదస్సు

WG: బాల్య వివాహాల నిర్మూలన ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నరసాపురం బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.సూర్య ప్రకాశరావు అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై శుక్రవారం పీచుపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై జయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 28, 2026 / 08:13 AM IST

షోరూంలోనే రిజిస్ట్రేషన్.. వాహనదారులకు ఇబ్బందులు

TG: షోరూంల్లో వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జఠిలంగా మారుతోంది. కొత్త వాహనం కొన్న వారికి సాంకేతిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వాహనాలకు సంబంధించిన RCలు అందడంలోనూ జాప్యం అవుతోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరి పేర్లపై రెండు వాహనాలు ఉన్నప్పటికీ ఆ డేటా షోరూంల సర్వర్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు.

February 28, 2026 / 08:12 AM IST

నేడు కరకగూడెంలో ఎమ్మెల్యే పర్యటన

BDK: కరకగూడెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభిస్తారని అలాగే పలు అభివృద్ధి, వివాహ వేడుకల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

February 28, 2026 / 08:11 AM IST

విద్యార్థులు చ‌దువులో రాణించాలి: కలెక్టర్

VSP: సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ పథకాలపై వివరించారు. చదువులో రాణించి దేశానికి సేవ చేయాలని సూచించారు.

February 28, 2026 / 08:10 AM IST

సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో నిందితులు అరెస్ట్

ADB: పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో ఆరుగురు నిందితులు కేసు నమోదు చేసినట్లు CI నాగరాజు నిన్న తెలియజేశారు. పట్టణానికి చెందిన బాధితుడు కనిష్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేశామన్నారు. అనుమతి లేకుండా షాపు యజమానులు సెల్ ఫోన్లను కొనవద్దని CI సూచించారు.

February 28, 2026 / 08:10 AM IST

కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై CPM ఆగ్రహం

అన్నమయ్య: జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తే, పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం కార్మికులను పోలీసులు అడ్డుకొని, ధర్నాలకు అనుమతి లేదని వెళ్ళిపోవాలని ఆదేశించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది.

February 28, 2026 / 08:10 AM IST

భారత్-నేపాల్‌ సరిహద్దు మూసివేత

నేపాల్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ద‌ృష్ట్యా MAR 2 నుంచి 5 అర్ధరాత్రి వరకు భారత-నేపాల్‌ సరిహద్దు మూసివేయనున్నట్లు నేపాల్‌ హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. భారత్‌కు ఆనుకుని ఉన్న బాంకే జిల్లా అంతటా సరిహద్దు అవుట్‌ పోస్టులు 5 వరకు మూసివేయనున్నట్లు తెలిపింది. తప్పనిసరి అయితే తప్ప నిషేధిత కాలంలో సరిహద్దు దాటకుండా ఉండాలని 2 దేశాల పౌరులకు సూచించారు.

February 28, 2026 / 08:10 AM IST

పామూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ప్రకాశం: పామూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను TDP నాయకుడు మనోహర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, విధవులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 08:05 AM IST

నేడు చిల్పూరు గుట్టలో స్వామివారి కళ్యాణం

JN: చిల్పూరు గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఈ కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఛైర్మన్ శ్రీధర్ రావు తెలిపారు. స్వామివారి కళ్యాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

February 28, 2026 / 08:03 AM IST

దూడపై దాడి చేసి చంపిన పెద్దపులి

AP: పోలవరం జిల్లాలోని రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. రాత్రి పశువులపాకలో దూడపై దాడి చేసి పెద్దపులి చంపేసింది. 20 రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లాలో ఇదే పెద్దపులి సంచరించినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపులి సంచారంతో భయాందోళనకు గిరిజనులు గురవుతున్నారు.

February 28, 2026 / 08:03 AM IST

గన్నవరంలో కూరగాయల ధరలు ఇవే.!

కృష్ణా: గన్నవరంలో శనివారం రోజువారీ కూరగాయల ధరలు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించాయి. టమాటా రూ.14కి లభించగా, వంకాయలు రూ.16-18 వరకు నమోదయ్యాయి. ఉల్లి రూ.23, బంగాళాదుంపలు రూ.22గా ఉన్నాయి. దొండ, దోసకాయ రూ.24 చొప్పున, బీట్‌రూట్ రూ.25కి విక్రయమయ్యాయి. క్యాప్సికం రూ.61, ఫ్రెంచ్ బీన్స్ రూ.51గా ఉండగా, బీర రూ.24, పచ్చిమిర్చి రూ.38గా నమోదైంది.

February 28, 2026 / 08:03 AM IST

ప్రజాస్వామ్యానికే విజయం: ఏఐఎస్ఎఫ్

KMM: వివాదాస్పద అంశాలతో ఉన్న 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని AISF KMM జిల్లా కార్యదర్శి ఇటుకల రామకృష్ణ అన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను కేంద్రం మానుకోవాలని హితవు పలికారు.

February 28, 2026 / 08:03 AM IST

నేడు సౌందరరాజన్ అంత్యక్రియలు

HYD: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు సౌందరరాజన్ అంత్యక్రియలు ఇవాళ జరుగనున్నాయి. ఆలయం వెనుకభాగంలోని గోశాల పక్కన దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుందని తెలిపారు. సౌందరరాజన్ మరణించడంతో చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇవాళ ఆలయం మూసి ఉంటుందని అర్చకులు తెలిపారు.

February 28, 2026 / 08:02 AM IST