SKLM: లావేరి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచడంలో పారిశ్రామిక కార్మికులకు కీలకపాత్ర అన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను శుభ్రం చేయాలన్నారు. అనంతరం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
PPM: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్నాయని కలెక్టర్ ప్రభాకర రెడ్డి వెల్లడించారు. శనివారం సీతానగరం మండలం జోగింపేటలోని ఏపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పరిశీలించారు.
VSP: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పెందుర్తి జోన్ 96వ వార్డు యాతపేటలో పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అర్హులందరికీ ప్రతి నెల పింఛన్ అందజేస్తున్నామని అన్నారు.
PPM: జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి నివాసాల వద్దకే కలెక్టర్ వెళ్లి నేరుగా పింఛన్లను పంపిణీ చేశారు.
తల్లిదండ్రుల మాటలను కాదని, ప్రేమించిన వారి కోసం ఇళ్లు వదిలి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల కథే ‘ది కేరళ స్టోరీ 2’. తాము నమ్మిన ప్రేమే ఒక పెద్ద మోసమని తెలుసుకున్న వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దర్శకుడు ఇందులో చూపించాడు. నటీనటుల ప్రతిభ, ఎమోషనల్ కథాంశం, సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు మూవీకి ప్లస్. కథను ఒకే కోణం నుంచి చూపడం, కొన్ని చోట్ల మితిమీరిన సినిమాటిక్ లిబర్టీ మైనస్.
MDK: రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేవాలయాలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని హరీష్ రావు విమర్శించారు. కోకాపేటలో ఉన్న విశాఖ శారదా పీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఖండించారు. నిత్యాన్నదానం, కేసీఆర్ హయాంలో నిర్మించిన దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం తగదని హరీష్ రావు పేర్కొన్నారు.
NLG: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆరోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవరకొండ 2వ వార్డు కౌన్సిలర్ పొట్ట మురళిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శనివారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కోనసీమ: పి.గన్నవరం మండలం పరిధిలో డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ వద్ద నిర్వహించిన టైలర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టానిక్స్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హొవే విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టైలర్ల వృత్తి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
TG: మార్చి 8 నుంచి 14 వరకు జరగనున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచులకు గచ్చిబౌలి హాకీ స్టేడియం రెడీ అయ్యింది. ఈ టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ సహా 8 దేశాలు తలపడనున్నాయి. మార్చి 8న ఉదయం 7:30కు CM రేవంత్ రెడ్డి పోటీలను ప్రారంభించనున్నారు. ఈ మ్యాచులలో గెలిచిన టాప్ జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి.
KMR: మద్నూర్‌కు చెందిన తివారీ దివ్య ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్షలో దివ్య 300 మార్కులకు గాను 150 మార్కులు సాధించి అర్హత సాధించారు. సాధారణ కుటుంబానికి చెందిన తివారీ పూజ-నందకిషోర్ దంపతుల కుమార్తె అయిన దివ్య, జాతీయ స్థాయి పరీక్షలో రాణించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ATP: తాడిపత్రి మండలం ఆలూరు కోన రంగనాయక స్వామి ఆలయానికి వెళ్లే రహదారి సమస్యకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. గత కొన్ని ఏళ్లుగా సరైన రోడ్డు లేక భక్తులు, గ్రామస్థులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఆలూరు నుంచి ఆలూరు కోన వరకు పూర్తిస్థాయి రహదారి నిర్మాణం చేయించారు.
KMM: జిల్లా వెలుగుమెట్ల బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం కు ఎంపీ ఈటెల రాజేంద్ర శనివారం చేరుకున్నారు. కాగా వారిని బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల బాధితులను ఎంపీ ఈటెల రాజేంద్ర పరామర్శించనున్నారు. వారితోపాటు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, భూక్యా సీతారాం నాయక్, విద్యాసాగర్, సొప్పరి క్రాంతి, భూక్యా రాజేష్ పాల్గొన్నారు.
సత్యసాయి: పరిగి మండలం కొడిగెనహల్లిలో 1 కోటి 80 లక్షల రూపాయలతో బీసీ బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణం కొరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి GV ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తోంది.
SRCL: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయచ్చని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్టేషన్ ఆవరణలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. డ్రైవర్లకు వైద్య పరీక్షల అనంతరం అవసరమైన మందులు, కళ్లజోళ్లను పంపిణీ చేశారు.